
TSRTC – Ticket Rates: వచ్చే వారం నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీలు మోత.. కిలోమీటర్‌కు ఎంత పెరగనుందంటే..!

TSRTC – Ticket Rates: నష్టాలను పూడ్చుకునేందుకు కీలక చర్యలకు సిద్ధమైంది టీఎస్ ఆర్టీసీ. మరో మార్గం లేదని చెబుతున్న అధికారులు, టికెట్ రేట్లు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో వారం రోజుల్లో పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. టీఎస్‌ఆర్టీసీని కాపాడుకునేందుకు, సంస్థ నష్టాలను పూడ్చుకునేందుకు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఏడాదికి దాదాపు 1400 కోట్ల నష్టాలను భరిస్తున్నామని తెలిపారు రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై రూ. 468 కోట్ల భారం పడిందన్నారు మంత్రి. అయితే ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఆర్టీసీని కాపాడుకునేందుకు ఛార్జీలు పెంచుతున్నామని తెలిపారాయన. ఆర్డినరీ బస్సులో కిలోమీటర్‌కు 20 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది.
మరో వారం రోజుల్లోనే పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం టికెట్ ఛార్జీల నుంచి వచ్చే ఆదాయం మీదే ఆర్టీసీ ఆధారపడి ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. డీజిల్ ధరలు పెంచి కేంద్రం రాష్ట్రాలపై భారం వేసిందన్నారు మంత్రి. ఛార్జీల పెంపు అంశాన్ని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారాయన. టికెట్ ధరల పెంపుతో RTCకి వెంటనే 700 కోట్ల రిలీఫ్ దొరుకుతుందని చెప్పారు మంత్రి పువ్వాడ. వాస్తవానికి నెల క్రితమే ధరల పెంపు ప్రపోజల్స్‌ను తయారు చేసి ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపారు ఆర్టీసీ అధికారులు. పల్లె వెలుగులో కిలోమీటర్‌కు 20 పైసలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో..30 పైసలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై 468 కోట్ల భారం పడిందని, ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32Rqy0C
0 Response to "TSRTC – Ticket Rates: వచ్చే వారం నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీలు మోత.. కిలోమీటర్‌కు ఎంత పెరగనుందంటే..!"
Post a Comment