-->
SP Dance: బుల్లెట్టు బండి సాంగ్‌కు ఎంజాయ్‌ చేస్తూ స్టెప్పులేసిన జిల్లా ఎస్పీ.. వైరల్ అవుతున్న వీడియో..

SP Dance: బుల్లెట్టు బండి సాంగ్‌కు ఎంజాయ్‌ చేస్తూ స్టెప్పులేసిన జిల్లా ఎస్పీ.. వైరల్ అవుతున్న వీడియో..

District Sp Stepped On The Bullet Bandi Song Video Goes Viral


నిన్న మొన్నటి వరకు బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు.. సెలబ్రెటీలు, మామూలు వ్యక్తులు.. సోషయల్ మీడియాలో చేస్తున్న డ్యాన్స్ ట్రెండింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సెలబ్రెటీలు కాదు.. పోలీస్ అధికారులు కూడా ఈ పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. ప్రతి రోజు యూనిఫామ్ లో ఎంతో సీరియస్ గా కనిపించే.. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. పిల్లలతో కలసి ఇలా బుల్లెట్ బండి సాంగ్ కి స్టెప్పులు వేశారు.

పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వీక్లీ ఆఫ్ లో ఉన్న పోలీసులు వారి కుటుంబ సభ్యులు వన భోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కంబదూరు మండలం రామప్పబండ వద్ద పోలీసుల వన భోజన మహోత్సవ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సబ్ డివిజన్ పరిధిలో వీక్లీ ఆఫ్ లో ఉన్న సిబ్బందిని ఒకచోట చేర్చి ఆటల పాటలతో సందడిగా గడిపారు. ఈ సందర్భంగా పోలీసులు, పిల్లలూ కలిసి పాటలకు డ్యాన్సులు వేస్తుంటే జిల్లా ఎస్పీ కూడా వారితో కలిసి స్టెప్పులు వేశారు. దీంతో అక్కడున్న పోలీసులంతా ఆశ్చర్యపోయారు. ఎస్పీ ఏంటి స్టెప్పులు వేయడం ఏంటని.. కాసేపు అవాక్కయ్యారు..ఆ తర్వాత సిబ్బంది కూడా స్టెప్పులేస్తూ… ఎంజాయ్ చేస్తూ గడిపారు.నిత్యం పని ఒత్తిడిలో తలమునకలై ఉండే పోలీసులకు ప్రభుత్వం వీక్ ఆఫ్ ఇచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు వీక్లీ ఆఫ్ రోజున ఊరట కల్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఇది ఎంతో మంచి పరిణామం అన్నారు.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/321I1mI

Related Posts

0 Response to "SP Dance: బుల్లెట్టు బండి సాంగ్‌కు ఎంజాయ్‌ చేస్తూ స్టెప్పులేసిన జిల్లా ఎస్పీ.. వైరల్ అవుతున్న వీడియో.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel