-->
Omicron: ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం.. గత ఏడు రోజుల్లో అక్కడ భారీగా కేసులు నమోదు..!

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం.. గత ఏడు రోజుల్లో అక్కడ భారీగా కేసులు నమోదు..!

Omicron

Omicron Variant: యూఎస్‌లో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కారణంగా, కోవిడ్ కేసులలో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. గత ఏడు రోజుల్లో అమెరికాలో దాదాపు 258,312 కేసులు నమోదయ్యాయి. యూఎస్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రవేశపెట్టిన ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత, కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులలో భారీ పెరుగుదల ఉంది. యూఎస్‌లో రోజుకు సగటున 2,65,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కొత్త కేసుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది.

జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి మధ్యలో కోవిడ్-19 రోజువారీ కొత్త కేసుల సంఖ్య 250,000గా నమోదవుతున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరగడంతో క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించాల్సిన చాలా కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు. అదే సమయంలో, విమానయాన సేవలో పనిచేసే ఉద్యోగుల కొరత కారణంగా వేలాది విమానాలు కూడా రద్దు చేశారు.

యూఎస్‌లో గత రెండు వారాల్లో, కోవిడ్-19 మరణాల సంఖ్య కూడా రోజుకు సగటున 1200 నుంచి 1500కి పెరిగింది. 86 క్రూయిజ్ షిప్‌లలో కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ ఒక టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ, కొన్ని దేశాల నుంచి కోవిడ్ ఒమిక్రాన్ డేటా గురించి మాకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి, ఈ వేరియంట్ యూఎస్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మేం ఇంకా ఏమీ చెప్పలేని స్థితిలో లేం. కోవిడ్ వ్యాక్సినేషన్ లభ్యతపై యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు ఇబ్బంది పడుతుందో చెప్పడం మరింత కష్టమని ఆయన అన్నారు.

Also Read: Shar Dubey: ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఇండో-అమెరికన్ సీఈఓను ప్రశంసించిన ఆనంద్‌ మహింద్రా..

Breast Milk Jewelry: మాతృత్వ మధురిమలు గుర్తుండిపోయేలా.. తల్లి పాలతో నగల తయారీ.. అసలేంటంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qypsiu

Related Posts

0 Response to "Omicron: ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం.. గత ఏడు రోజుల్లో అక్కడ భారీగా కేసులు నమోదు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel