
Murder Plan: ఆ ఎమ్మెల్యేను చంపితే కోటి రూపాయలిస్తా.. సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఫోన్ కాల్..!

Murder Plan: కర్నాటక కాంగ్రెస్ నేత ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే హత్యకు ఆయన చేసిన కుట్ర కన్నడ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏ ఎమ్మెల్యే హత్యకు కుట్ర పన్నారు.. ఆ కాంగ్రెస్ నేత ఎవరు? అనే వివరాలు తెలుసుకుందాం. బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేయాలంటూ కాంగ్రెస్ నేత ఫోన్‌లో మాట్లాడిన వీడియో కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్సార్ విశ్వనాథ్‌ను హత్య చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు.
అయితే, ఈ సంభాషణలకు సంబంధించిన వీడియో ఫుటేజీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కన్నడ నాట పెను ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ హత్యకు కుట్ర జరిగిందని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ నేత గోపాలక్రిష్ణ మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వనాథ్‌కు భద్రత కల్పించాలని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పోలీసులను ఆదేశించారు. మరి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో.. కాంగ్రెస్ నేతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Also read:
Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3d7bDkR
0 Response to "Murder Plan: ఆ ఎమ్మెల్యేను చంపితే కోటి రూపాయలిస్తా.. సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఫోన్ కాల్..!"
Post a Comment