-->
Monkey Viral Video: తాతకు సాయం చేసిన కోతి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్..

Monkey Viral Video: తాతకు సాయం చేసిన కోతి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్..

Monkey Helping Nature Video Goes Viral


సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కోతులకు సంబంధించిన వీడియోలు బాగా ఇష్టపడతారు నెటిజన్లు. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కోతి.. ఓ వ్యక్తికి సాయం చేసిన తీరుని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి కోతులు ఎప్పుడూ అల్లరి చేస్తూ.. మనుషులను ఇబ్బంది పెడతాయి. కానీ ఈ కోతి మాత్రం ఎంతో బుద్ధివంతురాలిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో.. కోతి చేతిలో ఒక కర్ర ఉంది.. అయితే.. అక్కడే ఉన్నఓ వృద్ధుడికి ఆ కర్ర అవసరం అవుతుంది. దాంతో అతను ఆ కర్ర తనకి ఇవ్వమంటూ కోతిని అడుగుతాడు. దీంతో కోతి కూడా వెంటనే కర్రను తీసుకుని వెళ్లి వృద్ధుడికి ఇచ్చింది. అయితే.. కర్ర ఇచ్చిన వెంటనే కోతి అక్కడినుంచి పారిపోయింది.. కర్రతీసుకొని తనను కొడతాడనుకుందో ఏమో పాపం…భయపడుతూ కర్రను అతనికి ఇచ్చి కోతి తుర్రుమంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయని.. వీడియో అద్భుతంగా ఉందంటూ పేర్కొంటున్నారు. బ్యూటిఫుల్‌ఫుల్‌గ్రామ్ పేరుతోఉన్న యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GGp5J1

Related Posts

0 Response to "Monkey Viral Video: తాతకు సాయం చేసిన కోతి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel