-->
Manasanamha: ఆస్కార్ అవార్డు బరిలో నిలిచిన తెలుగు సినిమా.. కృతజ్ఞతలు తెలిపిన మనసానమః మూవీ టీమ్..

Manasanamha: ఆస్కార్ అవార్డు బరిలో నిలిచిన తెలుగు సినిమా.. కృతజ్ఞతలు తెలిపిన మనసానమః మూవీ టీమ్..

Short Film

సినీ రంగంలో అత్యున్నత స్థాయి పురస్కారం ఆస్కార్ అవార్డుల బరిలో తెలుగు సినిమా నిలిచింది. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు మనసానమః లఘు చిత్రం సెలక్ట్ అయ్యింది. యంగ్ టాలెంట్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిలిం మనసానమః. ఇందులో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసానమః షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్‏లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం.. ఫిలిం ఫెస్టివల్స్‏లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది.

ఆస్కార్ అవార్డు కోసం క్వాలిఫైలో ఉన్న మనసానమః చిత్రానికి ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‏లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ దీపక్‏తోపాటు నటీనటులు విరాజ్, దృషిక, సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ పాల్గోన్నారు. మనసానమః సినిమా ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనసానమః చిత్ర విశేషాలను, ఆస్కార్ పోటీలో ఎంపికపై వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ…ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు కంప్లీట్ రివర్స్ స్క్రీన్ ప్లేతో మ్యూజికల్ గా చేద్దామని అనుకున్నాం. కథను మొత్తం రివర్స్ లో తీయడం షూటింగ్ టైమ్ లో పెద్ద ఛాలెంజ్. ప్రొడక్షన్ టైమ్ లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మంచి టీమ్‏తో అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాం. మనసానమఃకు ఇంటర్నేషనల్‏గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్‏గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. నా అభిమాన దర్శకుడు సుకుమార్. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ…దీపక్ మనసానమః కథ చెప్పినప్పుడు చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకురాగలడా అనిపించింది. కానీ షార్ట్ ఫిలిం కంప్లీట్ అయ్యాక అతని వర్క్ ఎంటో తెలిసింది. గతేడాది లాక్ డౌన్ లో యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో గౌతమ్ మీనన్ గారి ప్రెజెంట్స్ తో రిలీజ్ చేశారు. అలాగే కన్నడలో కేజీఎఫ్ కో ప్రొడ్యూసర్స్ మనసానమః విడుదల చేశారు. ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆడియెన్స్ అందరికీ థాంక్స్ చెబుతున్నాం. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్ పై పాజిటివ్‏గా ఉన్నామన్నారు.

Also Read: Kevvu Karthik: కెవ్వు కార్తీక్ కేక పుట్టించాడు.. వెండితెరపై కమల్ హాసన్, బుల్లితెరపై కార్తీక్..

Katrina- Vicky kaushal: కత్రినా- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ !.. ఆహ్వానితుల జాబితా ఇదే!

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Ew75AB

0 Response to "Manasanamha: ఆస్కార్ అవార్డు బరిలో నిలిచిన తెలుగు సినిమా.. కృతజ్ఞతలు తెలిపిన మనసానమః మూవీ టీమ్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel