
Lucky Lottery : అదృష్టం అంటే ఇదే మరి.. స్నేహితుడు పంపిన గెట్‌వెల్ కార్డ్‌లో 7 కోట్ల లాటరీ కోట్లలో లాటరీ!

Viral News: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసేదాకా తలుపు తడుతూనే ఉంటుందట. అని ఒక సామెత ఉంది. జీవితంలో ఎవరైనాసరే అదృష్టం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతో ప్రయత్నించాం గాని అదృష్టం కలిసి రాలేదు అంటూ వాపోతుంటారు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తికి అదృష్టం వరదలై పారిందనాలి. అతను ఏం చేయకపోయినా.. కోట్లు సొమ్ము వచ్చి చేరింది. అనారోగ్యంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఎలాంటి సంపాదన లేకుండా.. కుటుంబ పోషణ భారంగా గడుపుతున్న ఓ వ్యక్తికి.. బంధువులో, స్నేహితులో వచ్చి చిన్న మొత్తం సహాయం చేసినా అదే అతనికి కొండంతగా అనిపిస్తుంది. అలాంటిది.. ఓ లాటరీ రూపంలో కోట్లు వచ్చి పడితే అతని ఆనందానికి హద్దేముంటుంది చెప్పండి. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం…
అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన అలెగ్జాండర్ మెక్లీష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో అతని స్నేహితుడి దగ్గరనుంచి మెక్లీష్‌కి ఒక కార్డ్ వచ్చింది. అదే అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఎలా అంటే.. మెక్లీష్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మెక్లీష్ పేరుతో మూడు లాటరీ స్క్రాచ్ ఆప్ టికెట్లను కొన్నాడు. సర్జరీ తర్వాత వాటిని మెక్లీష్‌కి పంపించాడు. వాటిని స్క్రాచ్ చేసి చూసిన మెక్లీష్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఎందుకంటే అతనికి 1 మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఏడున్నర కోట్ల రూపాయలు. దీంతో మెక్లీష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32LZ5x9
0 Response to "Lucky Lottery : అదృష్టం అంటే ఇదే మరి.. స్నేహితుడు పంపిన గెట్‌వెల్ కార్డ్‌లో 7 కోట్ల లాటరీ కోట్లలో లాటరీ!"
Post a Comment