-->
Luck: రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్.. కొద్దిగంటల్లోనే దిమ్మతిరిగే వార్త.. అమ్మిన వ్యక్తి కూడా షాక్

Luck: రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్.. కొద్దిగంటల్లోనే దిమ్మతిరిగే వార్త.. అమ్మిన వ్యక్తి కూడా షాక్

Jackpot Lottery

లక్ ఎప్పుడు.. ఎలా తిరుగుతుందో.. ఫేట్.. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వొచ్చు. ఇక రాత్రికి రాత్రే సిరిమంతులు అవ్వాలని ఎవరు కోరుకోరు చెప్పండి. డబ్బు ఉన్నవాళ్లు కూడా ఒక్కరోజులోనే ఆ డబ్బు డబుల్ అవ్వాలని ఆశపడతారు. అయితే అందరికీ ఆ అదృష్టం ఉండదు. ఎక్కడో నూటికో, కోటికో ఒక్కరికి లక్ ఫ్యాక్టర్ వర్కువుట్ అవుతుంది. తాజాగా ఓ అంబులెన్సు డ్రైవర్‌ను లక్ వెతుక్కుంటూ వచ్చింది. లాటరీ టికెట్​ కొన్న కొద్ది గంటల్లోనే అతను ఏకంగా రూ.కోటి రూపాయలు గెలుచుకున్నాడు. బెంగాల్​లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొన్నారు. ఊహించని విధంగా మధ్యాహ్నానికే రూ. కోటి జాక్​పాట్ తగిలింది. దీంతో కొద్దిగంటల్లోనే కోటీశ్వరుడు అయ్యారు హీరా. లాటరీ టికెట్ తగలగానే ఫస్ట్ షాకింగ్‌గా అనిపించిందని… ఏం చేయాలో అర్థంకాక సహాయం కోసం పోలీస్​స్టేషన్​కు వెళ్లారు హీరా. పోలీసులు హీరాను జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటివద్ద దిగబెట్టి వచ్చారు.

తనకు చాలా డబ్బు అవసరం ఉందని.. ఈ డబ్బుతో  అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స చేయిస్తానని, ఓ ఇల్లు కొనుక్కుంటానన్నారు హీరా. అయితే లాటరీ అమ్మిన వ్యక్తి కూడా ఈ జాక్‌పాట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఎన్నోఏళ్లుగా లాటరీ వ్యాపారం చేస్తున్నానని.. చిన్నమొత్తంలో రావడం చూశా కానీ.. ఇంత పెద్ద జాక్​పాట్​ను చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపాడు. తన షాపులో కొన్న లాటరీకి రూ. కోటి జాక్​పాట్ రావడం హ్యాపీగా ఉందన్నాడు.

Also Read: వారి నాలుకలు కోయాలి.. మాజీ మంత్రి పరిటాల సునిత సంచలన కామెంట్స్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3dMWTaV

Related Posts

0 Response to "Luck: రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్.. కొద్దిగంటల్లోనే దిమ్మతిరిగే వార్త.. అమ్మిన వ్యక్తి కూడా షాక్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel