
Jawad Cyclone: బీ అలర్ట్.. తీవ్ర తుపానుగా మారిన జోవాద్.. గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం..

Jawad Cyclone Live Updates: జోవాద్ తుపాను మరింత బలపడుతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో తుపాను కేంద్రీకృతమైంది. ఇక విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో జోవాద్ తుపాను కేంద్రీకృతమైంది. ఇక ఉత్తర దిశగా కుదులతున్న తుపాను రేపు (ఆదివారం) మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుపాను ప్రభావంతో
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో 100 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద జోవాద్ తుపాను గురించి మాట్లాడుతూ.. ‘పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఫలితంగా శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయి’అని తెలిపారు
జోవాద్ తుపానుకు సంబంధించిన తాజా విశేషాలు లైవ్ అప్‌డేట్స్‌లో చూడండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ly4vTd
0 Response to "Jawad Cyclone: బీ అలర్ట్.. తీవ్ర తుపానుగా మారిన జోవాద్.. గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం.."
Post a Comment