-->
Hyderabad: భాప్‌ రే.. ఇలా కూడా మోసం చేస్తారా?.. పోలీసుల విచారణలో కళ్లు చెదిరే నిజాలు.. తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!

Hyderabad: భాప్‌ రే.. ఇలా కూడా మోసం చేస్తారా?.. పోలీసుల విచారణలో కళ్లు చెదిరే నిజాలు.. తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!

Hyderabad – Cheating: ఇతర రాష్ట్రాలలో గడువు ముగిసిన లారీలను స్క్రాప్ లో తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటికి దొంతనంగా టాంపరింగ్ చేసిన చాసిస్ నంబర్ ను సరిచేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న ఓ ముఠాను మైలార్ దేవుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ నెలలో సాంబమూర్తి అనే వ్యక్తి అన్వర్, హాజి అనే వ్యక్తుల వద్ద రూ.7 లక్షలకు ఓ సెకండ్ హ్యాండ్ లారీని కొనుగోలు చేశాడు. అనంతరం ఇంజిన్ లో సమస్య రావటంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. లారీని చెక్ చేసిన మెకానిక్, లారీ సర్వీస్ అయిపోయిన తర్వాత కొత్తగా చేసి అమ్మాడని సాంబమూర్తికి తెలిపాడు. మోసపోయానని గ్రహించిన సాంబమూర్తి మైలార్ దేవుపల్లి పోలీసులను ఆశ్రయించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్, హాజీ, నజీర్ లను అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేసిన మోసాన్ని పోలీసులకు వివరించారు. అది విని పోలీసులే షాక్ అయ్యారు. నాగాలాండ్ లో గడువు ముగిసిన లారీలను తుక్కుకింద తక్కువ ధరకు కొని వాటి ఇంజిన్ నంబర్లను, చాసిస్ నంబర్లను మార్చి, దానికి కావలసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ఆర్టీఏ కార్యక్రమంలో దొంగతనంగా తయారు చేసి లారీలను అమ్ముతున్నామని తెలిపారు. కాగా, ఈ కేసులో వారి వద్దనుండి మరో నాలుగు లారీలతో పాటు దొడ్డిదారిలో సృష్టించిన నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మోసగాళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీపీ గంగాధర్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం గాలిస్తోందన్నారు.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/330j2AC

0 Response to "Hyderabad: భాప్‌ రే.. ఇలా కూడా మోసం చేస్తారా?.. పోలీసుల విచారణలో కళ్లు చెదిరే నిజాలు.. తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel