-->
Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి స్త్రీవలన ధన లాభం ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి స్త్రీవలన ధన లాభం ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today

Horoscope Today (05-December -2021): ఎవరైనా సరే రోజు మొదలు అవుతుందంటే.. ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు .. చేపట్టిన పనుల్లో ఏమైనా అడ్డంకులు వస్తాయా.. అసలు తనకు ఈరోజు ఎలా ఉంటుంది అని  ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 5 వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులల్లో విజయం సొంతం చేసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు కలుగుతాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి సంతృప్తీ కరంగా సాగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త ఇల్లు కొనుగోలు విషయంపై ఆసక్తిని చూపిస్తారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు పరిష్కారమవుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశి విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు. బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ధనాభివృద్ధి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా ఉంటుంది. కొత్తపనులను వాయిదా వేసుకోవడం మంచిది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్త మెలగడం మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.  వాయిదా వేసిన పనులను పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యవసాయ లాభాలను అందుకుంటారు. ప్రయత్నాలు సఫలమవుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు గౌరవ మర్యాదలను పొందుతారు. మానసిక ఆందోళన నెలకొంటుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికీ అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. స్త్రీవలన ధన లాభం పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి.. ఆందోళన నెలకొంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆకస్మిక లాభం పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. క్రీడాకారులకు , రాజకీయ రంగంలోనివారు మంచి అవకాశాలను అందుకుంటారు.  బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు కష్టానికి ఫలితం కనిపించదు. అధిక శ్రమ చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల వలన ధన వ్యయం అధికంగా ఉంటుంది. అనారోగ్యం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. గత వారంతో పోలిస్తే..కొంతమేర తగ్గిన బంగారం, వెండి ధరలు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ox4CAp

0 Response to "Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి స్త్రీవలన ధన లాభం ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel