
Groom Escape: పెళ్లి రోజున వరుడు ఇంటి నుండి పారిపోయాడు, వధువు పెవిలియన్ వద్ద వేచి ఉంది; బాలిక కుటుంబం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది

Groom Escape: మరికాసేపట్లో పెళ్లి జరుగనుంది. పెళ్లి మండపంలో అప్పటికే పెళ్లి కూతురు వేచి చూస్తోంది. పెళ్లికి సంబంధించి క్రతువులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు పెళ్లి కొడుకు రాకకోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఊరేగింపుగా పెళ్లి మండపానికి రావాల్సిన వరుడు.. పెళ్లి మండపానికి రాకుండా మార్గం మధ్యలోనే జంప్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జుంజునులో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు ఎంతకీ రాకపోవడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు, వరుడి కుటుంబ సభ్యులు సైతం కంగారుపడ్డారు. వెంటనే ఈ విషయమై పోలీసులను ఆశ్రయించిన వరుడి కుటుంబ సభ్యులు.. తమ కొడుకు కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పారిపోయిన పెళ్లి కొడుకును హర్యానాలో పట్టుకున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే అతను పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.
వివరాల్లోకెళితే.. సమాచారం మేరకు కస్ని గ్రామానికి చెందిన రవికుమార్‌కు, దింగ్డియా గ్రామానికి చెందిన కవితతో డిసెంబర్ 1న వివాహం జరగాల్సి ఉంది. అయితే, పెళ్లి మండపానికి వరుడు ఊరేగింపుగా రావాల్సి ఉంది. ఇంతలో రవి కుమార్ తన బైక్‌పై ఇంటి నుంచి జంప్ అయ్యాడు. ఆ సమయంలో వరుడు అన్న, మామ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారి ప్రయత్నం విఫలమైంది. అయితే, దీనిపై వరుడు కుటుంబ సభ్యులు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. వరుడు తమను చీట్ చేశాడంటూ వధువు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తమను మోసం చేశారంటూ సూరజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. వధువు ఆరోపణల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31smYtc
0 Response to "Groom Escape: పెళ్లి రోజున వరుడు ఇంటి నుండి పారిపోయాడు, వధువు పెవిలియన్ వద్ద వేచి ఉంది; బాలిక కుటుంబం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది"
Post a Comment