-->
Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌, ముంబైలో తగ్గింపు..!

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌, ముంబైలో తగ్గింపు..!

Gold

Gold Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలకు.. బ్రేక్ పడుతూ వస్తోంది. తాజాగా పసిడి ధర పెరిగింది. అయితే ఇతర ప్రధాన నగరాల్లో ధర పెరిగితే.. హైదరాబాద్‌లో మాత్రం స్వల్పంగా తగ్గింది. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం (డిసెంబర్‌ 12)న దేశీయంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 వద్ద ఉంది.
► ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,790 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,790 వద్ద కొనసాగుతోంది.
► తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,380ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500 వద్ద కొనసాగుతోంది.

► పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 వద్ద కొనసాగుతోంది.
► కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
► తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
► ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.
► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

PF Withdrawal: మీ పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలా..? ఎన్ని రోజులు పడుతుంది..? పూర్తి వివరాలు..!

MG Motor India: ఎంజీ మోటారు ఇండియా నుంచి 2022లో ఎలక్ట్రిక్‌ కార్లు.. ఎంత ధర అంటే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pOctc1

Related Posts

0 Response to "Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌, ముంబైలో తగ్గింపు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel