-->
Dhanurmasa: తిరుప్పావై ఐదో పాశురం.. పాపాలు తొలగుటకు కృష్ణుడికి 8పుష్పాలను అర్పించమంటున్న గోదాదేవి

Dhanurmasa: తిరుప్పావై ఐదో పాశురం.. పాపాలు తొలగుటకు కృష్ణుడికి 8పుష్పాలను అర్పించమంటున్న గోదాదేవి

Thiruppavai Pasuram 5

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఐదోరోజు.  ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు.  ద్రావిడ సంప్రదాయం ప్రకారం ఈ నెల రోజులూ ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం నిర్వహిస్తారు.  సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్.. ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. రంగనాథుడినే భర్తగా పొందింది. కనుక ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావైలోని పాశురాలను రోజుకొకటి చొప్పున పఠిస్తూ శ్రీమహావిష్ణువుని కొలిచిన వారికీ కొంగుబంగారమని శాస్త్రాలు చెబుతున్నాయి. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ నెల రోజులూ పెళ్లికానివారు తిరుప్పావై పఠించడం వలన మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం.  ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పురాణాల కథనం.

ఈ పాశురాల్లో మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి.” చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి.. పంటలు పండుతాయి.. దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి.. అని గోదాదేవి విన్నవిస్తుంది. ఈరోజు ధనుర్మాసంలో ఐదో రోజు.. ఐదో రోజు పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

ఐదో రోజు పాశురం: 

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై

త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

భావం: కృష్ణుడు ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబంధం గల ఉత్తర దేశమందలి మధురా నగరికి నిర్వాకుడు.. పవిత్రమైన జలంగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడు. గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపం అయిన వాడు. యశోదా మాతచే తాడుతో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానిస్తే మన గత జన్మ పాపములను నశింపజేసే వాడు. శ్రీకృష్ణుడు.  మనం చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కనుక భక్తితో భగవంతుడి నామాలు పాడమని గోదాదేవి గోపికలకు తెలిపింది.

మన పాపాలు తొలగుటకు శ్రీకృష్ణుడికి అర్పించాల్సిన 8పుష్పాలు:
1 అహింస
2 ఇంద్రియ నిగ్రహం
౩ సర్వభూతదయ

4 క్షమ
5 జ్ఞానం
6 తపస్సు
7 సత్యం
8 ధ్యానం
ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము.

 

Also Read:

సంతోషకరమైన జీవితం కావాలంటే ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించండి..!

నేడు తిరుప్పావైలో నాల్గోపాశురం.. మ౦చిని వర్షంలా కురిపించు అని కృష్ణుడిని గోపికలతో కలిసి వేడుకున్న గోదాదేవి

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3J6c6CD

Related Posts

0 Response to "Dhanurmasa: తిరుప్పావై ఐదో పాశురం.. పాపాలు తొలగుటకు కృష్ణుడికి 8పుష్పాలను అర్పించమంటున్న గోదాదేవి"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel