-->
AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Aha Ott

AHA Studio: తొలి తెలుగు ఓటీటీ సంస్థగా మొదలై సంచలనంగా మారింది ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహా. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన టాక్‌ షోలతో ప్రేక్షకులను పెంచుకుంటూ పోతోందీ ఆహా. మొదలైన కేవలం 21 నెలల్లోనే ఏకంగా 11 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో ఆహా యాప్‌ టాప్‌ గేర్‌లో దూసుకుపోతూ బడా ఓటీటీ సంస్థలకు సైతం గట్టి పోటీనిస్తోంది. క్వాలిటీ కంటెంట్‌, మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్‌ డిజైన్‌ చేస్తుండడం వల్లే ఆహాకు ఈ రేంజ్‌లో క్రేజ్‌ పెరుగుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కేవలం సౌత్‌ ఇండియాకు మాత్రమే పరిమితమైన ఆహా తాజాగా నార్త్‌ ఇండియాలో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆహా యాజమాన్యం తాజాగా సోమవారం కీలక ప్రకటన చేసింది.

ప్రపంచ స్థాయి వినోదాన్ని అందించే క్రమంలో ఆహా స్టూడియోస్‌ను ప్రారంభించారు. పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లను నిర్మించే లక్ష్యంగా ఆహా ఈ స్టూడియోను ప్రారంభించింది. అంటే ఇకపై ఆహా నుంచి పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌లు రానున్నాయన్నమాట. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ అధికారికంగా తెలిపారు. ఆహా స్టూడియోస్‌ను ప్రకటించడమే కాకుండా తమ తొలి వెబ్‌ సిరీస్‌ను సైతం ప్రకటించారు.

Aha

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను ఆహా తెరకెక్కించనన్నట్లు ప్రకటించారు. నరసింహరావు తీసుకొచ్చిన సంస్కరణలతో పాటు ఆయన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఆహా స్టూడియోస్‌ నుంచి వస్తోన్న ఈ తొలి పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Prabhu deva: జీనీగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌.. ఆకట్టుకుంటోన్న మై డియర్‌ భూతం మోషన్‌ పోస్టర్‌..

Prabhu deva: జీనీగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌.. ఆకట్టుకుంటోన్న మై డియర్‌ భూతం మోషన్‌ పోస్టర్‌..

Cabbage Side Effects: ఈ వ్యక్తులు క్యాజేజీని అస్సలు తినకూడదట.. ఎందుకో తెలుసుకోండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yqo7gZ

0 Response to "AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel