-->
Wife and Husband: మెసేజ్‌ పంపాలంటే అనుమతి తీసుకోవాల్సిందే.. భర్తకు భార్య పెట్టిన కండీషన్స్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

Wife and Husband: మెసేజ్‌ పంపాలంటే అనుమతి తీసుకోవాల్సిందే.. భర్తకు భార్య పెట్టిన కండీషన్స్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

Woman

Wife and Husband: ఏ స్త్రీ తన భర్త తనకు విధేయుడిగా ఉండాలని కోరుకోదు చెప్పండి. అందులో భాగంగానే.. చాలా మంది భార్యామణులు.. తమ భర్తలను కంట్రోల్‌లో పెట్టేందుకు రకరకాల కండీషన్స్ పెడుతుంటారు. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళన కూడా తన భర్తను కంట్రోల్ చేసేందుకు ఏకంగా రూల్ బుక్‌నే సిద్ధం చేసింది. ఆ రూల్‌ బుక్‌లోని రూల్స్‌ ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. అయితే, సదరు తన టిక్‌టాక్ అకౌంట్ ద్వారా.. తన భర్తను ఎలా కంట్రోల్‌లో పెడుతుందో వివరించింది. అది విన్న జనాలు అవాక్కయ్యారు. ఇవేం కండీసన్స్ రా అయ్యా అంటూ బిత్తరపోతున్నారు.

ఒకరిపై మరొకరు గౌరవం చూపినప్పుడే భార్య, భర్తల బంధం మరింత అందంగా ఉంటుందని అంటారు. కానీ ఇద్దరిలో ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించినప్పుడు.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అయితే, బాగా తెలివిమీరిన ఓ భార్య.. తన భర్తను అదుపు చేసేందుకు చిత్రవిచిత్రమైన ఆక్షలు విధించింది. అందుకోసం ప్రత్యేకంగా రూల్ బుక్ కూడా రెడీ చేసింది. ఆ రూల్‌ బుక్‌లోని రూల్స్‌ని టిక్‌టాక్‌లో వెల్లడించి.. జనాలను అవాక్కయ్యేలా చేసింది.

బెయిలీ అనే ఈ మహిళ టిక్‌టాక్‌లో @bmcpher అనే అకౌంట్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. పెళ్లయినప్పటి నుంచి తన భర్తను ఎలా కంట్రోల్ చేసిందో ఆ వీడియోలో చెబుతోంది. బెయిలీ తన భర్తకు వివాహం చేసుకోవడానికి ముందే కఠినమైన షరతులు పెట్టినట్లు చెప్పింది. తనపై ఆంక్షలు విధిస్తే అస్సలు సహించదట. బెయిలీ నిబంధనల ప్రకారం.. ఆమె భర్త ఏ స్త్రీతోనూ స్నేహం చేయకూడదు. ఆఫీసులో ఏ స్త్రీతోనూ మాట్లాకూడదు. అంతేకాదు, ఒక మహిళకు మెసేజ్‌లు పంపాల్సిన అవసరం వస్తే.. ముందుగా ఆ విషయాన్ని భార్యకు చెప్పాలి. ఇక మరీ గడ్డు పరిస్థితి ఏంటంటే.. భర్త తన తల్లిదండ్రులు ముఖ్యమా, భార్య ముఖ్యమా? అని ఎంచుకోవాల్సి వస్తే భార్య అనే చెప్పాలట. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు చాంతాడంత లిస్ట్‌తో భర్తపై కండిషన్స్ అప్లై చేస్తోంది బెయిలీ.

బెయిలీ వీడియోను ఇప్పటి వరకు 6 లక్షల మందిపైగా చూశాడు. బెయిలీ ఆంక్షలు విని అందరూ షాక్ అవుతున్నారు. ఆమె అభద్రతా భావంలో ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనిని పిచ్చి అంటారంటూ మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరైతే.. బెయిలీ ఆంక్షలను సమర్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HLF9up

Related Posts

0 Response to "Wife and Husband: మెసేజ్‌ పంపాలంటే అనుమతి తీసుకోవాల్సిందే.. భర్తకు భార్య పెట్టిన కండీషన్స్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel