-->
Weekly Horoscope: వార ఫలాలు: ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.. ఆటంకాలు ఎదురవుతాయి..!

Weekly Horoscope: వార ఫలాలు: ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.. ఆటంకాలు ఎదురవుతాయి..!

Weekly Horoscopes

Weekly Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో జ్యోతిషులు తెలిపినదాని ప్రకారం.. నవంబర్‌ 7 నుంచి నవంబర్‌ 13వ తేదీ వరకు వివిధ రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం.

మేష రాశి:

ఈ రాశివారికి ఈ వారంతమంతా కలిసి వస్తుంది. అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృషభ రాశి:

అనుకున్న పనులన్ని ఈ వారంలో సాధించగలుగుతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో మనోబలం లభిస్తుంది. వ్యాపారాలలో నష్టాలు రాకుండా తీవ్రంగా శ్రమిస్తారు. ఏ విషయంలోనైనా ఏకాగ్రత పెట్టడం ఎంతో ముఖ్యంగా. ఏ పని ప్రారంభించాలన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది.

కర్కాటక రాశి:

ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చదువుల నిమిత్తం దూర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది.

సింహరాశి:

ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇతరుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. ఆపదలు తొలగించుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య రాశి:

ఉద్యోగంలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. బంధు, మిత్రుల నుంచి సూచనలు, సలహాలు అందుకుంటారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు.

తుల రాశి:

ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో, వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని కొందరు నష్టపరిచే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. త్వరలో మంచి భవిష్యత్తు ఏర్పడతుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఇబ్బందులు పడుతుంటారు. మిత్రుల నుంచి సహకారం అందుకుంటారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొడం మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి:

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మకర రాశి:

పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

కుంభ రాశి:

కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవరిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపార విషయంలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు.

మీన రాశి:

దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో అనుకోకుండా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..!

TTD: మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BT6oiC

Related Posts

0 Response to "Weekly Horoscope: వార ఫలాలు: ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.. ఆటంకాలు ఎదురవుతాయి..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel