-->
Viral Video: ఈ 11 నెలల బాలిక.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది.. ఒలింపిక్స్ పంపాల్సిందే అంటున్న నెటిజన్లు..!

Viral Video: ఈ 11 నెలల బాలిక.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది.. ఒలింపిక్స్ పంపాల్సిందే అంటున్న నెటిజన్లు..!

Child

Viral Video: ప్రస్తుత కాలంలో పిల్లల్లో పరిణతి చాలా త్వరగా వస్తోంది. మోస్ట్ టాలెంటెడ్‌గా ఎదురుగుతున్నారు. అలాంటి టాలెంటెడ్ పిల్లలకు ప్రపంచంలో కొదవే లేదు. సాధారణంగా నెలల వయస్సున్న పిల్లలు పాకడమే కష్టం. అలాంటి నడవటం సాధ్యమా?. ఇక 11 నెలల వయస్సు పిల్లలంటే గోడలను పట్టుకుని, చేతులు పట్టుకుని నడిచేందుకు ట్రై చేస్తుంటారు. మహా అయితే, అటూఇటూగా నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికీ అంత బలంగా ఉండలేరు. కానీ, ఓ 11 చిన్నారి మాత్రం ఏకంగా స్నో బోర్డింగ్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. అది చూసి నెటిజన్లు ఇదేం మాయ కాదుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. చిన్నారిని తప్పకుండా ఒలింపిక్స్‌కు పంపించాల్సిందేనని అంటున్నారు. ఇంతకీ ఆ చిన్నారి వయస్సు ఎంతో తెలుసా? కేవలం 11 నెలలు మాత్రమే. అసలు నడకే రాని ఈ వయస్సులో చిన్నారి ఏకంగా స్నో బోర్డింగ్ చేయడం.. సంచలనం సృష్టిస్తోంది.

ఈ చిన్నారి పేరు వాంగ్ యుజీ. ఈ చిన్నారికి ఏడాది కూడా నిండలేదు. చైనాలోని హెబీ ప్రావిన్స్‌కు చెందిన ఈ చిన్నారి టాలెంట్‌కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిన్నారి.. మంచు గడ్డపై ప్రొపెషనల్‌గా స్నోబోర్డింగ్ చేసింది. మరో వ్యక్తి సాయంతో ఆ చిన్నారి స్నోబోర్డింగ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌సైడ్ ఎడిషన్ అనే యూట్యూబ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌‌గా మారింది. ఈ ఆశ్చర్యకరమైన 41 సెకన్ల వీడియో నవంబర్ 19న యూట్యూబ్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు ఈ వీడియోకి 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు. 4 వేల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, చాలామంది చిన్నారిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CKmRWH

0 Response to "Viral Video: ఈ 11 నెలల బాలిక.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది.. ఒలింపిక్స్ పంపాల్సిందే అంటున్న నెటిజన్లు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel