-->
Viral News: ఘనంగా పెళ్లి బారాత్ జరుగుతోంది.. సడెన్‌గా వచ్చిన మాజీ ప్రియురాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..

Viral News: ఘనంగా పెళ్లి బారాత్ జరుగుతోంది.. సడెన్‌గా వచ్చిన మాజీ ప్రియురాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..

Marriage

Viral News: ప్రతీ జంట తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని చూస్తారు. అందుకు అనుగుణంగా ప్లాన్స్ వేసి.. ఆ ప్లాన్స్‌ని అమలు చేస్తారు. తాజాగా ఓ యువకుడు కూడా తన పెళ్లిన అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. అనంతరం నిర్వహించే బరాత్‌ను కనివిని ఎరుగని రీతిలో ఏర్పాటు చేశాడు. డీజే, బ్యాండ్‌తో హోరెత్తించాడు. వధువు, వరుడి కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువు అంతా సంతోషంగా చిందితులేస్తూ బరాత్‌ను ఎంజాయ్ చేశారు. వధువరులు కూడా ఆ సందడిని ఎంజాయ్ చేశారు. ఇంతలో సడెన్‌గా వచ్చిన పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాంతో వధువరుల కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని.. పెళ్లి కొడుకు తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం… బిహార్‌లోని ధన్‌బాద్‌లో ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న యువతి, అదే స్కూల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న యువకుడు ప్రేమలో పడ్డారు. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇంతలో ఆ యువకుడు మరో పెళ్లికి అంగీకరించి.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకున్నాడు. తన ఫోన్ కూడా స్విచ్ఆఫ్ చేసుకున్నాడు. విషయం తెలిసి షాకైన.. ప్రియురాలు పోలీసులు ఆశ్రయించింది. యువకుడు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బరాత్ మధ్యలోనే పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత ప్రేయసి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది. పోలీసులు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3l4Zh0L

Related Posts

0 Response to "Viral News: ఘనంగా పెళ్లి బారాత్ జరుగుతోంది.. సడెన్‌గా వచ్చిన మాజీ ప్రియురాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel