-->
US PURE: విద్యా సాధికారితే లక్ష్యం.. ఏపీ, తెలంగాణలోని పేద విద్యార్థులకు అండగా ‘ప్యూర్’ స్వచ్చంధ సంస్థ..

US PURE: విద్యా సాధికారితే లక్ష్యం.. ఏపీ, తెలంగాణలోని పేద విద్యార్థులకు అండగా ‘ప్యూర్’ స్వచ్చంధ సంస్థ..

Pure Ngo

US PURE: విద్యా సాధికారితే ‘ప్యూర్’ లక్ష్యం.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థుల చదువులకు సహకారం అందించేందుకు అవసరమైన వనరులను అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది ‘పీపుల్స్‌ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌’. ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగాస్వాములయ్యారు అమెరికాలోని తెలుగు చిన్నారులు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పట్టణ గ్రామీణ విద్యార్థులకు అండగా నిలిచింది ‘పీపుల్స్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌-ప్యూర్‌’. అమెరికాలో తెలుగువారు ప్రారంభించిన స్వచ్ఛంద సేవా సంస్థ ఇది. నిరుపేద విద్యార్థులకు మేమున్నాం అని అండగా నిలిచింది ప్యూర్‌. ఇందుకు అవసరమైన వనరులను కల్పిస్తోంది ఈ సేవా సంస్థ. పేద పిల్లలకు విద్య, సాధికారిత అందించడం కోసం ప్యూర్‌ చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో 500 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. 35 యూత్‌ చాఫ్టర్లు ఇందులో పాల్పంచుకుంటున్నాయని వివరించారు ప్యూర్‌ సీపీవో హేమ.

పారదర్శకత, జవాబుదారి తనంతో సేవలు అందిస్తున్న ప్యూర్‌ సంస్ధ ఇప్పటి వరకూ 500 ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన వనరులను సమకూర్చింది. పీపుల్స్‌ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు చిన్నారులు. చిన్న మొత్తాలు అయినా తాము సమకూర్చిన డబ్బు మంచి పనికి ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు ఈ చిన్నారులు. తాము చేపట్టిన సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన చిన్నారులకు ప్రశంసాపత్రాలను అందించింది ప్యూర్‌ సంస్థ.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cXFw6S

0 Response to "US PURE: విద్యా సాధికారితే లక్ష్యం.. ఏపీ, తెలంగాణలోని పేద విద్యార్థులకు అండగా ‘ప్యూర్’ స్వచ్చంధ సంస్థ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel