
Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..

త్రిష..దక్షిణాదిలోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్గా నిలిచింది. సహయనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోయిన్గా మారి వరుస అవకాశాలను అందుకుంది త్రిష.. అందం, అభినయంతో టాలీవుడ్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా..తమళంలోనూ టాప్ హీరోయిన్గా మారిపోయింది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులు తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది త్రిష.. ఇటీవల 96 సినిమాతో తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన త్రిషకు మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్ రాలేదు. అయినా ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఇదిలా ఉంటే.. త్రిషకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు త్రిష. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్ట, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండవచ్చు.
ట్వీట్..
Happy and privileged to be the first Tamil actor to have received the golden visa
@efirstglobal @alsaadgdrfa @gdrfa @dubai #uaegovernment #dubaiculture pic.twitter.com/MgCnwtZj5m
Thank you@emiratesfirst
@jamadusman @rjrijin— Trish (@trishtrashers) November 3, 2021
Also Read: Major Movie: 26/11 అమర వీరుడు సందీప్ కృష్ణన్ బయోపిక్ వచ్చేస్తోంది.. మేజర్ విడుదల ఎప్పుడంటే..
Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Vijay Sethupathi: ఎయిర్పోర్ట్లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..
0 Response to "Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే.."
Post a Comment