-->
Telangana Devudu : ఆ ఇద్దరు సినిమాకు ప్రాణం పోశారు .. తెలంగాణ దేవుడు సినిమా పై బ్రహ్మానందం ప్రశంసలు..

Telangana Devudu : ఆ ఇద్దరు సినిమాకు ప్రాణం పోశారు .. తెలంగాణ దేవుడు సినిమా పై బ్రహ్మానందం ప్రశంసలు..

Brahmanandam

Telangana Devudu : ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్‌ వడత్యా దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయినిట్ కు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం విషెస్ తెలిపారు.   తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ , సంగీత ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా పై బ్రహ్మానందం ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్ హరీశ్ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారని.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారని కొనియాడారు బ్రహ్మానందం.

అలాగే ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా బాగుంటుందని ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని బ్రహ్మానందం అన్నారు. హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను తనకిచ్చారని అన్నారు. సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకాబోతోంది. ఈ సినిమాను జీషన్ ఉస్మానీ నిర్మించగా.. నందన్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HhT9M8

Related Posts

0 Response to "Telangana Devudu : ఆ ఇద్దరు సినిమాకు ప్రాణం పోశారు .. తెలంగాణ దేవుడు సినిమా పై బ్రహ్మానందం ప్రశంసలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel