-->
SBI Bank: షార్ట్ వేసుకుని ఎస్‌బిఐ బ్యాంకులోకి వచ్చిన వ్యక్తి.. అది గమనించిన సిబ్బంది ఏం చేశారంటే..!

SBI Bank: షార్ట్ వేసుకుని ఎస్‌బిఐ బ్యాంకులోకి వచ్చిన వ్యక్తి.. అది గమనించిన సిబ్బంది ఏం చేశారంటే..!

Sbi

SBI Bank: టెక్నాలజీ పెరిగింది. సెల్‌ఫోన్లు ప్రతీ ఒక్కరి చేతిలో ఉన్నాయి. ఇంటర్నెట్ సదుపాయం మరింత విస్తృతం అయ్యింది. ఫలితంగా ప్రపంచమే ఒక కుగ్రామంలా మారింది. ఈ భూ మండలంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇలా నిత్యం ఏదో ఒక అంశం తెరమీదకు వస్తూనే ఉంది. ప్రపంచ దేశాల మ్యాటర్ కాదులే గానీ.. తాజాగా మన దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

కొన్ని నెలల క్రితం ఓ మహిళ చీర కట్టుకుని రావడంతో రెస్టారెంట్‌లోకి ప్రవేశానికి అనమతించలేదు. ఈ వార్తు అప్పుడు పెను దుమారమే రేపింది. ఆ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కేసే కోల్‌కతాలో వెలుగు చూసింది. ఇక్కడ ఒక వ్యక్తి షార్ట్ ధరించి ఎస్‌బిఐ బ్యాంకులో ప్రవేశించాడు. అయితే, షార్ట్‌లో ఉన్నారని, ఆఫీసులోకి ఎంట్రీ లేదంటూ బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది అతన్ని వెనక్కి తిప్పి పంపించేశారు. ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గల ఓ ఎస్‌బిఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది.

ఇదే విషయాన్ని బాధిత వ్యక్తి సోషల్ మీడియాలో బహిర్గతం చేశాడు. ‘తాను షార్ట్ ధరించి ఎస్‌బిఐ కార్యాలయానికి వెళ్లాను. కానీ, షార్ట్ ధరించారనే కారణంతో నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. బ్యాంక్‌లోకి ప్రవేశించాలంటే ఫుల్ ప్యాంట్ ధరించి రావాలని అడిగారు. బ్యాంకు.. కస్టమర్ల నుంచి మర్యాద ఆశిస్తున్నట్లుగా ఉంది.’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. బ్యాంకు సిబ్బంది తీరును తూర్పారబడుతున్నారు. కొంతమంది బ్యాంకు సిబ్బందికి క్లాస్ పీకగా.. ఫుల్ డ్రెస్ వేసుకుని బ్యాంకుకు వెళ్లాలని మరికొందరు హితవు చెబుతున్నారు. మరికొందరైతే.. ఎస్‌బిఐ‌పై మండిపడుతున్నారు. ‘ఎస్‌బిఐలో మీ ఖాతాలను మూసివేయండి’ అంటూ పిలుపునిచ్చారు.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qXT5M3

0 Response to "SBI Bank: షార్ట్ వేసుకుని ఎస్‌బిఐ బ్యాంకులోకి వచ్చిన వ్యక్తి.. అది గమనించిన సిబ్బంది ఏం చేశారంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel