-->
Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Accident

Road Accident:  రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్‌టెక్‌, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మానకొండూరులో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా కరీంనగర్‌ వాసులుగా గుర్తించారు పోలీసులు. వీరంతా కారులో ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!

కమీషన్లకు కక్కుర్తిపడి సొంత ఇంటిని దోచారు.. కేడీలుగా మారిన మేనేజర్లు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CR6jw7

Related Posts

0 Response to "Road Accident: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel