-->
Pratip Chaudhuri: ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్టు.. ఎందుకో తెలుసా..?

Pratip Chaudhuri: ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్టు.. ఎందుకో తెలుసా..?

Sbi

Pratip Chaudhuri: ప్రముఖ దేశీ దిగ్గజ బ్యాంక్‌ స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి సోమవారం అరెస్టు అయ్యారు. ఇక్కడి చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్‌ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించడం లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణ ఎదుర్కొన్నాయి.అయితే ఢిల్లీలో ఆయనను అరెస్ట్‌ చేసి, జైసల్మేర్‌కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో జైసల్మేర్‌లో గర్‌ రాజ్‌వాడ హోటల్‌ ప్రాజెక్టుకుగాను గోడవన్‌ గ్రూప్‌నకు ఎస్‌బీఐ దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడు సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు ఎటువంటి పురోగతి లేదు. 2010లో ఈ అకౌంట్‌ మొండిబకాయిగా (ఎన్‌పీఏ) మారింది. రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన హోటల్‌ ప్రాపర్టీని సీజ్‌ చేసి, మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)కి విక్రయించినట్లు చౌదరిపై 2015లో కేసు నమోదైంది.

అయితే విక్రయించేటప్పుడు అన్ని విధి విధానాలను అనుసరించినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సంఘటనల తీరు గురించి కోర్టుకు సరిగ్గా వివరించినట్లు కనిపించడం లేదని బ్యాంక్‌ తెలిపింది. ఈ కేసులో ఎస్‌బీఐ పార్టీ కాదని, కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు అభిప్రాయాలను వినిపించే సందర్భం ఏదీ రాలేదని వివరించింది. చౌదరి సెప్టెంబర్‌ 2013లో పదవీ విరమణ చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Ola Car Offer: మీరు కారు కొనాలనుకుంటున్నారా..? కస్టమర్లకు ‘ఓలా’ అదిరిపోయే ఆఫర్‌.. లక్ష వరకు తగ్గింపు..!

Gas Cylinder: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో గ్యాస్‌ సిలిండర్లు.. కేంద్రం కీలక నిర్ణయం..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3by5Yn2

Related Posts

0 Response to "Pratip Chaudhuri: ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్టు.. ఎందుకో తెలుసా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel