-->
Padma Awards: పద్మ అవార్డులు విదేశీయులకు కూడా ప్రకటిస్తారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?

Padma Awards: పద్మ అవార్డులు విదేశీయులకు కూడా ప్రకటిస్తారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?

Padma

Padma Awards: ప్రముఖ శ్రీలంక నృత్యకారిణి డాక్టర్ వజిర చిత్రసేన కళారంగంలో చేసిన కృషికి గాను భారతదేశం పద్మశ్రీ ప్రకటించింది. చిత్రసేనతో పాటు సాహిత్యం, విద్యా రంగంలో చేసిన కృషికి మరో శ్రీలంక దివంగత ప్రొఫెసర్ ఇంద్రా దాసనాయకేకి కూడా పద్మశ్రీ దక్కింది. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే సమక్షంలో పద్మ అవార్డును అందజేశారు. భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఆపై పద్మశ్రీలు అత్యున్నత పురస్కారాలు. ఈ గౌరవాలు సాధారణంగా భారతీయ పౌరులకు ఉంటాయి. అయితే చాలా మంది విదేశీ సెలబ్రిటీలకు కూడా ఈ అవార్డులను ప్రకటించారు.

పద్మ అవార్డులు భారతీయ గౌరవాలు అయినప్పుడు విదేశీయులను ఎలా ఎంపిక చేస్తారు అనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. దీని గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఒక విదేశీ వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు జరిగింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కూడా పబ్లిక్ అఫైర్స్ విభాగంలో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2020లో 141 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఇందులో 7 పద్మ విభూషణ్, 16 పద్మ భూషణ్, 118 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. వీరిలో 18 మంది భారతీయులు కాదు. అదే సమయంలో 2019 సంవత్సరంలో కూడా 112 పద్మ అవార్డులు ప్రకటించారు. అందులో 11 మంది భారతీయులు కాదు.

అంతకుముందు సంవత్సరాలలో కూడా ఈ అవార్డులు విదేశీ పౌరులకు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డుల వెబ్‌సైట్ ప్రకారం.. పద్మ అవార్డును భారతీయ పౌరులకు మాత్రమే ఇవ్వాలనే రాతపూర్వక నిబంధన ఏమిలేదు.1954లో స్థాపించబడిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ‘పనిలో విశిష్టత’ ఆధారంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సాధకులకు పద్మ అవార్డులు ప్రకటిస్తారు.

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ctZjuG

Related Posts

0 Response to "Padma Awards: పద్మ అవార్డులు విదేశీయులకు కూడా ప్రకటిస్తారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel