-->
Kurup: ఏ సినిమాకు దక్కని అవకాశం .. బుర్జ్ ఖలీఫా పై దుల్కర్ సల్మాన్ సినిమా ట్రైలర్

Kurup: ఏ సినిమాకు దక్కని అవకాశం .. బుర్జ్ ఖలీఫా పై దుల్కర్ సల్మాన్ సినిమా ట్రైలర్

Kurup

Kurup: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కురుప్. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత దుల్కర్ నటించిన మరికొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.

ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా నటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్ సల్మాన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ”కురుప్” అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు దుల్కర్ . శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు దుల్కర్. ఇప్పటికే విడుడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేసింది. భారతదేశం నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా.. పరారీలో ఒకరైన సుకుమార కురుప్ లైఫ్ జర్నీ స్టోరినే కురుప్ సినిమా. దుబాయ్ లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా  పై ట్రైలర్ ఆవిష్కరించిన తొలి సౌత్ సినిమా కూడా ఇదే. నవంబరు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31O7MXf

Related Posts

0 Response to "Kurup: ఏ సినిమాకు దక్కని అవకాశం .. బుర్జ్ ఖలీఫా పై దుల్కర్ సల్మాన్ సినిమా ట్రైలర్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel