
KTR: మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్.. యాక్సిడెంట్‌లో గాయపడిన విద్యార్థులను ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు..

తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన కాన్వాయ్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తద్వారా వారికి సకాలంలో వైద్యం అందేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో సిరిసిల్ల పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. మధ్యమార్గంలో రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపేశారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థు్లను తన ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కాగా బుధవారం ఉదయం భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆదుకున్నారు. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్‌పై వెళ్తున్న కుటుంబ సభ్యులను ఓ కారు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వారు కిందపడిపోయారు. అదే సమయంలో అటువైపు వస్తోన్న కోమటి రెడ్డి క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి పంపించారు.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HrTLiB
0 Response to "KTR: మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్.. యాక్సిడెంట్‌లో గాయపడిన విద్యార్థులను ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు.."
Post a Comment