-->
Kilimanjaro: హైదరాబాద్ చిచ్చరపిడుగు.. అతిపెద్ద పర్వతాన్ని అలవోకగా అధిరోహించిన చిన్నారి హస్వి..

Kilimanjaro: హైదరాబాద్ చిచ్చరపిడుగు.. అతిపెద్ద పర్వతాన్ని అలవోకగా అధిరోహించిన చిన్నారి హస్వి..

Pulakita Hasvi

Pulakita Hasvi mountaineering: పర్వతాలను దూరంగా చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.. చుట్టూ మంచుచరియలు.. వాటిపై మేఘాలు కప్పుకోని అచ్చం కైలాసగిరిని తలపిస్తాయి. ఎముకలు కొరికే చలి ఉంటుంది. దగ్గరికి వెళ్లి తలెత్తి చూస్తే చాలు.. ఏదో మీదకు విసిరనట్లు కనిపిస్తుంది. అలాంటి ఎత్తైన పర్వాతాలను జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలని చాలామంది కలలు కంటుంటారు. శిఖరాలను అధిరోహించేందుకు ఎంతో కఠినమైన శిక్షణను పొందుతారు. అలాంటి శిఖరాన్ని 13 ఏళ్ల బాలిక అధిరోహించింది. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని హైదాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పులకిత హస్వి ఈ ఘనతను సాధించి.. పిన వయస్సులోనే రికార్డు సృష్టించింది. పులకిత హస్వి.. మంచిర్యాల జిల్లాకు చెందిన మురికి వెంకట్‌, మాధవిశ్రీల కూతురు. హస్వి తనతండ్రి నిర్వహిస్తున్న పాఠశాలలోనే 9వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 29న ప్రపంచంలోని ఏడు అత్యంత ఎత్తయిన శిఖరాలలో ఒకటైన కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని శిఖరాగ్రానికి చేరుకుంది.

కఠిన వాతావరణాన్ని తట్టుకుంటూ..

ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం అయిన కిలిమంజారోను అధిరోహించడానికి హస్వి నాలుగు నెలలు కఠిన శిక్షపొందింది. హైదరాబాద్‌ నుంచి టాంజానియా వెళ్లిన హస్వి.. బలమైన చల్ల గాలులను, ఎముకలు కొరికే చలి (-15 డిగ్రీ సెల్సియస్‌), దట్టమైన మంచు పొగ కఠిన వాతావరణాన్ని తట్టుకుంటూ ముందుకెళ్లింది. శిఖరాన్ని చేరుకునేందుకు హస్వి ఏకధాటిగా 16 గంటల పాటు నడిచింది. ప్రతికూల వాతవారణంలో గడ్డకట్టే చలిలో 5,895 మీటర్ల వరకూ ప్రయాణం చేసింది. ప్రొఫెషనల్‌ పర్వతారోహకుల సహాయంతో ఈ ప్రయాణం సాగింది. ఐదుగురితో సాగిన ఈ ప్రయాణంలో.. చివరకు ముగ్గురు మాత్రమే అధిరోహాంచారు. ఐదు రోజుల కష్టతరమైన ట్రెక్‌ను కోచ్‌ల సహాయంతో.. ప్రత్యేక శిక్షణతో పూర్తిచేసింది.

కఠిన శిక్షణతో ముందడుగు.. హస్వి..

తన శిక్షణ షెడ్యూల్ చాలా కఠినంగా సాగిందని హస్వి తెలిపింది. బ్యాగ్, కాళ్ళకు బరువులు కట్టుకుని చాలా దూరం నడిచానని తెలిపింది. యాత్ర ప్రారంభానికి వారం ముందు రాత్రంతా నడిచినట్లు తెలిపింది. ఓర్పుగా ఉండేందుకు ఏకాగ్రతను పెంచుకోవడానికి 895 కి.మీ పాటు సైకిల్ తొక్కినట్లు హస్వి తెలిపింది. ఇది చాలా కఠినమైనది తెలిసినప్పటికీ.. ఒక క్రీడాకారిణిగా వెనక్కి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు హస్వి తెలిపింది. శిఖరానికి వెళ్లడానికి దాదాపు 16 గంటల సమయం పడుతుందని.. మధ్యాహ్నానికి ఎక్కడో ఒకచోట ఆగుదామనుకున్నట్లు తెలిపింది. వెళ్లడం మరింత కష్టంగా మారండంతో తమ బృందంలోని ముగ్గురు సభ్యులు బేస్ క్యాంప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ.. తాను వెనక్కి వెళ్లకుండా ముందుకు సాగినట్లు తెలిపింది.

అత్యున్నత శిఖరాలనూ..

రాబోయే రోజుల్లో మొత్తం ఏడు అత్యున్నత శిఖరాలనూ అధిరోహించాలన్నది తన ఆకాంక్ష అని హస్వి తెలిపింది. పర్వతారోహణకు ‘సైక్లింగ్‌, బ్యాడ్మింటన్‌ తన ఫిట్‌నెస్‌కు ఎంతగానో దోహదపడతయాని పేర్కొంది. తల్లిదండ్రులు, కోచ్‌ సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని హస్వి స్పష్టంచేసింది. చదువులోనూ ముందంజలో ఉండే హస్వి పలు క్రీడల్లో బహుమతులు అందుకొని చురుకైన విద్యార్థిగా ప్రశంసలు పొందుతోంది.

జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌గా ఉన్న హస్వి ఇంతకుముందు 2021 ఏప్రిల్ లో నేపాల్‌లోని మౌంట్ నంగాకర్షాంగ్ (5010 మీ) పర్వతాన్ని అదేవిధంగా ఎవరెస్ట్ (5360 మీ) బేస్ క్యాంప్‌ను కూడా అధిరోహించింది.

పులకిత హస్వి ప్రయాణానికి సంబంధించిన వీడియో కోసం ఈ లింకును క్లిక్ చేయండి..

https://sidbaliga-my.sharepoint.com/:v:/p/reachme/EQ893G75vupOkWgg8NgQlt4BsZPTb2Wb2m7FF_jYITFQ5Q

Also Read:

Viral Video: నేను సైతం అంటూ మారథాన్‌లో పాల్గొన్న బాతు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Viral Video: ‘ఉన్నదాంట్లో హ్యాపీగా బ్రతకడమే జీవితం’.. గొప్ప సందేశాన్నిస్తున్న వెడ్డింగ్ వైరల్ వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EZCo6u

0 Response to "Kilimanjaro: హైదరాబాద్ చిచ్చరపిడుగు.. అతిపెద్ద పర్వతాన్ని అలవోకగా అధిరోహించిన చిన్నారి హస్వి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel