-->
Karthika Masam: రాజమండ్రి పుష్కర ఘాట్‌కు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న దేవాలయాలు..

Karthika Masam: రాజమండ్రి పుష్కర ఘాట్‌కు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న దేవాలయాలు..

కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ కు భక్తులు పోటెత్తారు. దీనికి తోడు నాగులచవితి రావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలకు క్యూ కట్టారు. గోదావరి నది స్థానమాచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమయితే అది ఒక విశేషమని, ఇది శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ద్రాక్షరామ భీమేశ్వర స్వామి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి,కుమారరామం, మురమల్ల వేరేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

బారులు తీరిన భక్తులు..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి నది కూడా భక్తజనసంద్రమైంది. తెల్లవారు జాము నుంచే స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదిలో వదులుతున్నారు. ఇక భక్తుల పూజలతో పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం క్షీర రామలింగేశ్వర స్వామి భక్తజనసంద్రమైంది. దీనితో పాటు జిల్లాలో కొలువైన శైవక్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఇక భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆయా దేవాలయాల అధికారులు కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Also Read:

Rasi Falalu: ఈ మూడు రాశుల వారు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారట.. ఆ రాశులేంటంటే..

Chanakya Niti : మీరు పిల్లలను ఉన్నతులు కావాలా?.. అయితే ఈ 3 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

IRCTC Tours: ఐఆర్సీటీసీ శ్రీరామాయణ యాత్ర ప్రారంభం ఈరోజే.. పూర్తి వివరాలు ఇవే!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GYQln8

Related Posts

0 Response to "Karthika Masam: రాజమండ్రి పుష్కర ఘాట్‌కు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న దేవాలయాలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel