-->
Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Biden Harris

Kamala Harris: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తన అధికారాలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించనున్నారు. కమల హారిస్ ఈ అధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది తాత్కాలికమే. సమాచారం ప్రకారం జో బిడెన్ కొలనోస్కోపీ కోసం అనస్థీషియా తీసుకోనున్నారు. దీంతో తన అధికారాన్ని కొంత కాలం కమలా హ్యారిస్‌కు అప్పగిస్తున్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్​కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు.

అయితే బైడెన్​అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలిసారి. అందువల్ల ఆ సమయంలో కమలా హారిస్​కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్టు శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ కూడా ధృవీకరించారు. ఇదే తరహాలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007లో తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు. జో బైడెన్‌ ఈ శనివారం 79వ ఏట అడుగుపెట్టనున్నారు.

జో బిడెన్, కమలా హారిస్ మధ్య గొడవ నిజమేనా..?
ఇటీవల అధ్యక్షుడు జో బిడెన్, కమలా హారిస్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఇది కాకుండా హారిస్ రేటింగ్ కూడా గత నెలల్లో బిడెన్ కంటే ఎక్కువగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవి నుంచి హ్యారీస్‌ను తప్పించవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. దీని కోసం బిడెన్ బ్యాక్‌డోర్ మార్గాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని విషయాలలో కమలా హారిస్, ఆమె సహాయకులు అధ్యక్షుడిపై కోపంగా ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు CNNకి తెలిపాయి. అయితే వీటికి ఎటువంటి ఆధారాలు మాత్రం లేవు.

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

మందుబాబులకు హెచ్చరిక.. అక్కడ రెండు డోసుల టీకా వేసుకుంటేనే మద్యం..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3r1Fd34

Related Posts

0 Response to "Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel