-->
India – Pak: మోడీ సర్కార్ రుణపడి ఉంటాం.. పాకిస్థాన్ జైళ్ల నుంచి భారత్ చేరుకున్న 20 మంది భారత మత్స్యకారులు..

India – Pak: మోడీ సర్కార్ రుణపడి ఉంటాం.. పాకిస్థాన్ జైళ్ల నుంచి భారత్ చేరుకున్న 20 మంది భారత మత్స్యకారులు..

Indian Fishermen

Indian fishermen: పాకిస్తాన్ జైలు నుంచి ఇరవై మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వారు సోమవారం అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. “మేము సముద్రంలో పట్టుబడ్డాము. గత నాలుగు సంవత్సరాలుగా లాంధీ జైలులో ఉన్నాము” అని ఒక మత్స్యకారుడు వెల్లడించారు. అలాగే జైలులో ఉన్న మా కుటుంబాలకు నెలకు రూ.9000 ఇస్తున్నందుకు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ అధికారులు వారి జాతీయతను ధృవీకరించిన తర్వాత సద్భావన సూచనగా మత్స్యకారులను విడుదల చేసినట్లు లాంధీ జైలు సూపరింటెండెంట్ ఇర్షాద్ షా తెలిపారు. మత్స్యకారులు నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపారని, పాక్ ప్రభుత్వం సౌజన్యంతో ఆదివారం విడుదల చేశామని ఇర్షాద్ షా తెలిపారు. లాహోర్‌లోని వాఘా సరిహద్దుకు మత్స్యకారులను తీసుకెళ్లేందుకు ఆది ట్రస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సామాజిక సంక్షేమ సంస్థ ఏర్పాట్లు చేసింది.

ఇప్పుడు ఎంత మంది భారతీయులు జైలులో ఉన్నారు?
588 మంది భారతీయ పౌరులు ఇప్పటికీ లాంధీ జైలులో ఉన్నారని, వారిలో ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నారని అధికారి ఇర్షాద్ షా తెలిపారు. సింధ్ హోం డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత విడుదల చేస్తాం’ అని ఆయన చెప్పారు. పాకిస్థాన్ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నందుకు గాను మత్స్యకారులను పాకిస్థాన్ సముద్ర భద్రతా దళం (పీఎంఎస్‌ఎఫ్) అరెస్టు చేసి డాక్ పోలీసులకు అప్పగించారు.

అంతకుముందు..
పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది ప్రారంభంలో 20 మంది భారతీయ మత్స్యకారులను  2019 ఏప్రిల్‌లో రెండవ బ్యాచ్ 100 మంది భారతీయ మత్స్యకారులను సద్భావన సూచనగా విడుదల చేసింది. పాకిస్తాన్ – భారతదేశానికి చెందిన మత్స్యకారులు సాధారణంగా ఒకరి జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు అరెస్టు అయిన తర్వాత జైలుకు వెళతారు.

అరేబియా సముద్ర తీరం వెంబడి ఇరు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దు రేఖ లేకపోవడంతో ఆధునిక నావిగేషన్ పరికరాలు లేని ఈ మత్స్యకారులు పొరపాటున రెడ్ లైన్ దాటారని ఎన్జీవో పాకిస్థాన్ ఫిషర్మెన్ ఫోరమ్ సీనియర్ అధికారి తెలిపారు. వారు ఖైదు చేయబడతారు.

ఇవి కూడా చదవండి: CM Jagan: రహదారులపై సీఎం జగన్ ఫోకస్‌.. రోడ్ల మరమ్మతులపై అధికారులకు డెడ్‌లైన్‌..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CgXxYg

0 Response to "India – Pak: మోడీ సర్కార్ రుణపడి ఉంటాం.. పాకిస్థాన్ జైళ్ల నుంచి భారత్ చేరుకున్న 20 మంది భారత మత్స్యకారులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel