-->
IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

Ind Vs Nz

IND vs NZ: టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత భారత్‌, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి టీ 20 మ్యాచ్‌ జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 165 పరుగుల టార్గెట్‌‌ను సునాయసనంగా చేధించింది. ముఖ్యంగా సూర్యకుమార్‌యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మరోవైపు ఒపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 36 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కివీస్‌ బౌలర్లలో బోల్ట్‌ రెండు వికెట్లు సాధించాడు. మిగతా వారు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 165 పరుగుల టార్గెట్‌‌ను ఉంచగలిగింది. కివీస్ టీంలో మార్టిన్ గప్టిల్ 70 (42 బంతులు, 3 ఫోర్లు, 4 సిక్సులు), మార్స్ చాప్‌మన్ 63(50 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ శతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో కివీస్ టీం పోరాడే స్కోర్‌ను సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో ఎవ్వరూ అంతగా రాణించలేదు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ తలో రెండు వికెట్లు, చాహర్, సిరాజ్ చెకో వికెట్ పడగొట్టారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Priyamani: ఎర్రచీరలో ప్రియమణి అదిరేటి అందాలు.. కుర్రాళ్ల మతులు పోవాల్సిందే.! వైరల్ పిక్స్!

CM KCR: గురువారం మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి లెటర్‌..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nrK23S

0 Response to "IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel