
Hyderabad: చదువు వత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు..

Hyderabad: చదువు ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ పరిధిలోని శాపూర్ నగర్‌లో నివాసం ఉండే రమేష్ కుమార్ తన కుమారుడు సుమిత్ కుమార్(17) ను చింతల్‌లోని భాగ్యరది జూనియర్ కళాశాలలో గత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాడు. ఎంపీసీ కోర్సులో జాయిన్ చేయించాడు. అయితే, సుమిత్ కుమార్ కు ఎంపీసీ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో పలుమార్లు సుమిత్ తండ్రి, అక్క, కాలేజ్ సిబ్బంది సుమిత్ కుమార్ కు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పినప్పటికీ ఎలాంటి మార్పు లేకపోయింది. దాంతో గతవారం సుమిత్ కుమార్ ను అదే కాలేజ్‌లో CEC గృప్‌లో బదిలిచేశారు. అయినా చదువు అంటే భయం, వత్తిడితో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
ఈ క్రమంలో సుమీత్ కుమార్ తన నివాసం శాపూర్ నగర్ నుండి కాలి నడకన బయలు దేరి గాజులరామారాం పరిధిలో ఉన్న చింతల్ చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ తన చెప్పులను విడిచి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గత రాత్రి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి తమ కొడుకు కనపడటం లేడని మిస్సింగ్ కేసు పెట్టగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చింతల్ చెరువు వద్ద చెప్పులు ఉండటంతో.. పోలీసులు ఇవి సుమిత్ కుమార్ వే అని నిర్దారించుకొని NDRF బృందం సహాయంతో మృతదేహం కోసం గాలింపు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..
Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..
Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oVbbeZ
0 Response to "Hyderabad: చదువు వత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు.."
Post a Comment