-->
Huzurabad By Election Result Live Counting: హుజురాబాద్‌లో గెలుపు ఎవరిది?

Huzurabad By Election Result Live Counting: హుజురాబాద్‌లో గెలుపు ఎవరిది?

Huzurabad

Huzurabad By Poll Result Counting Live Updates: తెలంగాణ చూపంతా హుజురాబాద్‌వైపే! ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. మళ్లీ కారు దౌడ్ తీస్తుందా? లేక కమలం వికసిస్తుందా? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ.TRS-BJP మధ్య జరిగే రసవత్తర పోటీలో విజయం ఏ పార్టీని వరించనుంది..? ఒకవేళ ఇక్కడ ఈటల రాజేందర్ నెగ్గితే.. అది బీజేపీ గెలుపు అవుతుందా..? ఈటల రాజేందర్ నెగ్గితే.. అది బీజేపీ ఆధిపత్యానికి సహకరిస్తుందా..? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ యేడాది జూన్‌ 4వ తేదీన టీఆర్ఎస్‌ పార్టీకి ఈటల రాజేందర్‌ గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత జూన్‌ 12 వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజురాబాద్‌ ఎన్నిక అనివార్యమైంది. జూన్‌ 14న ఆ వెంటనే బీజేపీలో చేరారు ఈటల రాజేందర్‌. అప్పటి నుంచి హుజురాబాద్‌ బైపోల్‌ ఎన్నిక రాష్ట్రంతోపాటు దేశమంతా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ బైపోల్‌ ఫలితాలను ముడిపెట్టడంతో అక్కడి ఓటర్లు ఇవ్వబోయే తీర్పుపై పొలిటికల్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EBFmxX

Related Posts

0 Response to "Huzurabad By Election Result Live Counting: హుజురాబాద్‌లో గెలుపు ఎవరిది?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel