
Gold Price Today: మహిళలకు గమనిక.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే..?

Gold Price Today: పసిడి ప్రియులకు మళ్లీ నిరాశే ఎదురైంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారి షాక్ తగిలింది. పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళీ.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు పైపైకి కదులుతున్నాయి. తాజాగా సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,110కు చేరింది. అలాగే 10 గ్రాముుల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,190కు చేరింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,110ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,190కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,560కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,790కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,290కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,290కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,110ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,190కు చేరింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి.
Cold: జలుబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..
Skin Care: మెడపైన ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ ఐదు మార్గాలను తెలుసుకోండి..
Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YODkva
0 Response to "Gold Price Today: మహిళలకు గమనిక.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే..?"
Post a Comment