-->
Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!

Gold Price

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూసే.. ఎందుకంటే రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర.. ఈ రోజు ఎగబాకింది. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతుండగా, శనివారం (నవంబర్‌ 27)న దేశీయంగా పరిశీలిస్తే10 గ్రాముల బంగారంపై నుంచి రూ.180 నుంచి రూ.310 వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,940గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 వద్ద కొనసాగుతోంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,930వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరలు పెరుగుదలకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

BMW Electric Vehicles: వచ్చే ఆరు నెలల్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కార్లు..!

Xiaomi Black Friday Sale: షావోమి బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తగ్గింపు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌లు!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3D3KWrS

Related Posts

0 Response to "Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel