-->
Goat Milk: మేక పాలు అమృతం.. అద్భుతం.. విలువ తెలిస్తే జన్మలో వదిలిపెట్టరు..

Goat Milk: మేక పాలు అమృతం.. అద్భుతం.. విలువ తెలిస్తే జన్మలో వదిలిపెట్టరు..

Goat Milk

Goat Milk: మీరు ఆవుపాలు తాగారు. గేదె పాలు తాగారు కానీ ఎప్పుడైనా మేకపాలు తాగారా..! ఎందుకంటే మేకపాలు ఇప్పుడు చాలా విలువైనవి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి విరుగుడుగా పనిచేస్తాయి. అందుకే కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం మేకపాల విక్రయాలను చేపడుతుంది. తాజాగా మద్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలో మేకపాల డైరీలను నెలకొల్పారు. మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అందుకే చిన్నపిల్లలకు మంచివని అంటారు. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఒక కప్పు ఆవు పాలకు బదులుగా ఒక కప్పు మేక పాలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మేకపాలలో మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్ మొదలైన వాటికి అద్భుతమైన మూలం కావడం వల్ల రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. మేక పాలలో కొవ్వు కణాలు ఇతర పాల కంటే చిన్నవిగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. మేక పాలలో మీడియం-గ్రేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి అంతేకాదు కొవ్వుగా అస్సలు నిల్వ ఉండదు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. ఇది పేగు సంబంధిత రుగ్మతలు, కరోనరీ వ్యాధుల చికిత్సలో కూడా సహాయపడుతుంది.

మేక పాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం ద్వారా చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తాయి. కరోనరీ వ్యాధి నుంచి గుండెను రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మేక పాలు జీవక్రియ ఏజెంట్‌గా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలు, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో తోడ్పడుతాయి. మేక పాలు రక్తంలో ప్లేట్‌లెట్లను విపరీతంగా పెంచుతాయి. డెంగ్యూ రాకుండా కాపాడుతుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారికి మేక పాలు మంచి ఎంపిక. చక్కెర అలెర్జీ ఉన్నవారికి మేక పాలు మంచి చాలా మంచివి. మేక పాలలో ఎక్కువగా A-2 (Casien) అనే ప్రొటీన్ ఉంటుంది ఇది అలెర్జీ, పెద్ద పేగు వ్యాధులు, చిరాకు మొదలైన వాటి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

T20 World Cup 2021: న్యూజిలాండ్ చేతిలో నుంచి టైటిల్ ఎందుకు జారిపోయింది.. కివీస్‌ చేసిన తప్పేంటో తెలుసా..?

నవగ్రహాల అనుగ్రహం లభించాలంటే వీటిని దానం చేయాల్సిందే..! అప్పుడే శుభపరిణామాలు..

గోవాలోని నిశ్శబ్ద బీచ్‌లని ఎప్పుడైనా సందర్శించారా..! ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళుతారు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qCMoyN

Related Posts

0 Response to "Goat Milk: మేక పాలు అమృతం.. అద్భుతం.. విలువ తెలిస్తే జన్మలో వదిలిపెట్టరు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel