
Fake Baba: సమస్యలన్నింటికీ కారణం పెళ్లేనంటూ విడదీశాడు.. అదును చూసి లోబరుచుకున్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Hyderabad – Fake Baba: కలికాలంలో అన్నీ ఇలాగే జరుగుతాయేమో మరి. టెక్నాజీపరంగా, నాలెడ్జ్ పరంగా ఎంత అభివృద్ధి చెందినా.. ఈరోజుల్లో కూడా మంత్రాలతో మోసం చేసేవాళ్లను గుడ్డిగా నమ్మేస్తున్నారు జనం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఆ బురిడీ గాళ్ల మాయలోపడి మోసపోయిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఉదంతమే భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీలో వెలుగు చూసింది.
మాటలతో మాయ చేసే మనుషులు ఉన్నంత కాలం.. వాళ్లను నమ్మి సర్వం కోల్పోయే అమాయక బాధితులు ఉంటూనే ఉంటారు. ఓల్డ్ సిటీలో అలాంటి కేటుగాళ్ల ఉచ్చులో పడ్డారు కొందరు బాధితులు. చంచల్‌గూడ పీఎస్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన అస్కరి అతని కుమారుడు ఆఫ్రోజ్.. తమకు పరిచయం ఉన్న వాళ్లను మంత్రాలు, క్షుద్రపూజల పేరుతో నమ్మిస్తూ వచ్చారు. వీళ్లు చెప్పే మాయ మాటల్లో ఒకటి అర నిజం కావడంతో చాలా మంది మహిళలు వీరి ఉచ్చులో పడి.. ఈ తండ్రీ కొడుకులు చెప్పినట్లు చేశారు.
అయితే, తాజాగా జహంగీర్‌బాద్‌కు చెందిన గౌసియాబేగం అస్వస్థతకు గురవడంతో ఆమెను జలీల్ అనే వ్యక్తి కిషన్ బాగ్ ప్రాంతంలో తీసుకెళ్ళి నయం చేయించాడు. అక్కడి ఆ ఫ్యామిలీ అంతా మంత్రాల మోసగాళ్లను నమ్ముతూ వచ్చారు. చివరకు పెద్ద అమ్మాయి సలేహ పెళ్లి తర్వాత వచ్చిన సమస్యలకు భర్తే కారణమని చెప్పి వారిని వీడదీశాడు ఫేక్ బాబా అస్కరి. ఆ తర్వాత వారితో ఆస్తులు కూడా అమ్మించి.. లోబర్చుకున్నాడు. అయితే, కొంతకాలం తరువాత అస్కరి అతని కుమారుడు అఫ్రోజ్ మోసగాళ్లని గుర్తించి చాంద్రాయణగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు బాధితులు. పోలీసులు ఆ ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు ఎంతమంది ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. మంత్రాలు, తాయత్తులు, క్షుద్రపూజల చేస్తే తలరాత మారిపోతుందని చెప్పే మోసగాళ్లను తేలికగా నమ్మవద్దని.. వాళ్ల ఉచ్చులో పడవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also read:
గ్యాస్ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..
Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lykctF
0 Response to "Fake Baba: సమస్యలన్నింటికీ కారణం పెళ్లేనంటూ విడదీశాడు.. అదును చూసి లోబరుచుకున్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే.."
Post a Comment