-->
English Channel: ఇంగ్లీష్ ఛానల్‌లో బోటు మునక.. నీటిలో కలిసిపోయిన 31 మంది ప్రాణాలు..

English Channel: ఇంగ్లీష్ ఛానల్‌లో బోటు మునక.. నీటిలో కలిసిపోయిన 31 మంది ప్రాణాలు..

Boat

English Channel: ఇంగ్లీష్ ఛానల్‌లో ఘోర పడమ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 31 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ మంత్రి ప్రకటించారు. పడవలో 34 మంది ప్రయాణిస్తుండగా.. పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 31 మంది మృతదేహాలు లభ్యమవగా.. ఇద్దరు సజీవంగా ఉన్నారని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు. మరొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. కాగా, మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చాన్నారి కూడా ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వసలదారులు ఏ దేశ పౌరులు అనేది ఇంకా తెలియలేదు. ప్రాణాలతో బయటపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను కలిసేందుకు ఫ్రెంచ్ ఇంటీరియర్ మినిస్టర్ ఆస్పత్రికి వెళ్లారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానిత మానవ అక్రమ రవాణాదారులను బుధవారం అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ మంత్రి తెలిపారు.

కలైస్ తీరంలో అనేక మంది ప్రజలు గల్లంతయ్యారని మత్స్యకారుల బృందం స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. వెంటనే రెస్క్యూ షిప్‌లు, హెలికాప్టర్‌లను పంపారు. ప్రస్తుతానికి ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెర్చ్‌లో బ్రిటీష్ పెట్రోలింగ్ షిప్‌తో పాటు బెల్జియన్, బ్రిటిష్ హెలికాప్టర్లు పాల్గొన్నాయని ఫ్రెంచ్ మంత్రి అనిక్ గిరార్డిన్ తెలిపారు.

గత మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంగ్లీష్ ఛానల్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్న చిన్న ఓడల సంఖ్య రెండింతలు పెరిగిందని లోకల్ సీ అథారిటీ చీఫ్ ఫిలిప్ డ్యూట్రిక్స్ గత వారం ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నవంబర్ 20 వరకు 31,500 మంది వలసదారులు ఇంగ్లీష్ ఛానల్‌ను దాటేందుకు ప్రయత్నించారని, వారిలో 7,800 మందిని కాపాడామని చెప్పారు. ఇకపోతే.. 130 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని పూర్తిగా భద్రత ఏర్పరచడం, వలస నౌకలు రాకుండా నిరోధించడం అసాధ్యం అని పేర్కొన్నారు. అలాగే.. వలసదారులను ఇంగ్లీష్ ఛానల్ దాటించే పడవల్లో సామార్థ్యానికి మించి జనాలను ఎక్కిస్తున్నారని, మాఫియా దీన్ని క్యాష్ చేసుకుంటోందని అన్నారు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZoihQo

Related Posts

0 Response to "English Channel: ఇంగ్లీష్ ఛానల్‌లో బోటు మునక.. నీటిలో కలిసిపోయిన 31 మంది ప్రాణాలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel