
ENG vs NZ Match Result: ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్..

ENG vs NZ Match Result: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సెమీ-ఫైనల్స్ తొలి పోరులో న్యూజిలాండ్- ఇంగ్లాండ్ టీమ్ లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పోరాడి గెలిచింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లండ్ తో తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ చెలరేగి ఆడటంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో 166 పరుగులు చేసింది ఇంగ్లాండ్. 167 టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదటి నుంచి పోరాడింది.
ఇంగ్లాడ్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ విలవిలలాడింది. ఆ సమయంలో మిచెల్ జట్టును ఆదుకున్నాడు. 47 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించాడు. కాన్వే 38 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు, టైటిల్ కోసం బలమైన పోటీ ఇచ్చింది. అయితే గాయపడిన ఆటగాళ్ల సమస్యతో ఇంగ్లాండ్ దబ్బతింది. కొద్దిమంది ప్రముఖ ఆటగాళ్ల సహాయంతో న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించింది. ఇక న్యూజిలాండ్ మొదటి నుంచి పోరాడుతూనే వచ్చింది. చివరిలో వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ పట్టువదలకుండా ఆడి విజయం సాధించింది న్యూజిలాండ్.
మరిన్ని ఇక్కడ చదవండి :
t20 world cup 2021: విలియమ్సన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.. స్పిన్నర్ అశ్విన్..
T20 World Cup: రెండేళ్ల క్రితం వరకు వెక్కిరింతలే.. ప్రమాదం అంచున కెరీర్.. కానీ, సహచరుడి టిప్స్‌తో టీ20 ప్రపంచకప్‌లో హీరోగా మారాడు..!
ENG vs NZ Highlights, T20 World Cup 2021: న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. పోరాడి గెలిచిన కివీస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bXtAll
0 Response to "ENG vs NZ Match Result: ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్.."
Post a Comment