-->
Earth Quake:తమిళనాడులో తెల్లవారుజామున భూకంపం.. భయంతో వణికిన జనం!

Earth Quake:తమిళనాడులో తెల్లవారుజామున భూకంపం.. భయంతో వణికిన జనం!

Earthquake

Tamil Nadu Earth Quake: తమిళనాడులో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.17 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం సంభవించినప్పుడు చాలా మంది ప్రజలు నిద్రలో ఉన్నారు. తక్కువ తీవ్రత కారణంగా, చాలా మంది ప్రజలు దాని ప్రకంపనలను గమనించలేకపోయారు. ఇదిలావుండగా మరికొన్నిచోట్ల కొంత మంది భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా దక్షిణ భారతదేశంలో అనేక సార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి.


Read Also… Coronavirus: మహారాష్ట్రాలో ఒమిక్రాన్‌ కలకలం..? సౌతాఫ్రిక నుంచి వచ్చిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pbyW2i

Related Posts

0 Response to "Earth Quake:తమిళనాడులో తెల్లవారుజామున భూకంపం.. భయంతో వణికిన జనం!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel