-->
Covid 19: విద్యాసంస్థల్లో కరోనా కల్లోలం.. యూనివర్సిటీ మూసివేత.. 25మంది విద్యార్థులు, 5 బోధనా సిబ్బందికి పాజిటివ్!

Covid 19: విద్యాసంస్థల్లో కరోనా కల్లోలం.. యూనివర్సిటీ మూసివేత.. 25మంది విద్యార్థులు, 5 బోధనా సిబ్బందికి పాజిటివ్!

Coronavirus

Coronavirus in Tech Mahindra University: కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. గ్రామాలు మొదలు దేశాల వరకు హడలిపోతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో పదుల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మొన్నటికి మొన్న వైరాలో కాలేజీలో పదుల సంఖ్యలో విద్యార్థులకు పాజిటివ్ అనే తేలగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున కలకలం రేపింది కరోనా. మేడ్చల్ దుండిగల్ బహదూర్‌పల్లి టెక్ మహీంద్ర యూనివర్సిటీలో గుబులు పుట్టించింది. విద్యార్థులకు కరోనా రావడంతో యూనివర్సిటీ సెలవులు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి శానిటైజ్ చేసి తరగతులు నిర్వహిస్తామని యూనివర్సిటీ ప్రతినిధులు ప్రకటించారు. ఇద్దరు విద్యార్థులకు జ్వరం కారణంగా కరోన పరీక్షలు చేసిన టెక్ మహీంద్ర యూనివర్సిటీ యాజమాన్యం 25 మంది విద్యార్థులు, ఐదుగురు భోదన సిబ్బందికి కరోనా వచ్చినట్లు తేల్చింది. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన టెక్‌ మహీంద్ర వర్సిటీ హోమ్ ఐసోలేషన్ కోసం స్టూటెంట్స్‌ను ఇళ్లకు పంపించింది. యూనివర్సిటీలో మొత్తం 1,500 మంది విద్యార్థులు ఉంటుండగా.. 30 మందికి కరోనా వచ్చిన విషయాన్ని మేడ్చల్ డిప్యూటీ డి ఎం ఎచ్ ఓ ప్రకటించారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటున్న తరుణంలో ఇలాంటి సమాచారం టెన్షన్ పుట్టిస్తోంది. మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సరిగ్గా అదే సమయంలోనే కేసులు భారీగా రావడంతో ఆందోళన మొదలైంది. మరోవైపు ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశ విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే ఈ వర్సిటీలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యాజమాన్యానికి సూచించారు.

Read Also… అరంగేట్ర మ్యాచులో గోల్డెన్ డక్.. అనంతరం బెస్ట్‌ ఫినిషర్‌గా మారాడు.. చిన్న వయసులోనే భారత సారథిగా ఎదిగిన ‘మిస్టర్ ఐపీఎల్’ ఎవరో తెలుసా?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cU90CE

0 Response to "Covid 19: విద్యాసంస్థల్లో కరోనా కల్లోలం.. యూనివర్సిటీ మూసివేత.. 25మంది విద్యార్థులు, 5 బోధనా సిబ్బందికి పాజిటివ్!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel