-->
Corona Vaccination: వారికి టీకాలు వేయడం కోసం ఇంటింటికీ వైద్యబృందాలను పంపుతాం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Corona Vaccination: వారికి టీకాలు వేయడం కోసం ఇంటింటికీ వైద్యబృందాలను పంపుతాం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Corona Vaccination

Corona Vaccination: కదలలేని పరిస్థితిలో ఉన్నవారు.. తీవ్ర వైకల్యాలను ఎదుర్కుంటున్న వారి కోసం ఇంటింటికీ కరోనా టీకాను వేయడానికి కేంద్ర ప్రభుత్వం బృందాలను పంపుతోంది. దీనికోసం ప్రతి జిల్లాలో ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) సెప్టెంబర్ 22వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. ఈ విషయంలో వారి సమాధానం కోసం వేచి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సమాచారం అందించింది.

వాస్తవానికి, వికలాంగులకు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను సులభంగా పొందడం కోసం ఎన్‌జిఓ ఎవారా ఫౌండేషన్ తరపున ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. ఈ పిటిషన్‌లో కోవిన్ (CoWIN) డిజిటల్ ఇంటర్‌ఫేస్ లేదా కోవిడ్ 19 (COVID-19) టీకా కేంద్రాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఉన్న వైకల్యాలున్న వ్యక్తులకు ఇంటింటికీ రోగనిరోధక టీకాలు వేయడం గురించి అభ్యర్ధించారు.

‘ఇంట్లో టీకాలు వేయడం దాని స్వంత లాజిస్టిక్స్, మెడికల్ కాంప్లికేషన్‌లను కలిగి ఉంటుంది’ అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సెప్టెంబరు 22న జారీ చేసిన తన సలహాలో, కేంద్రం రాష్ట్రాలు/యూటీలను “అటువంటి సంభావ్య లబ్ధిదారులు, వారి సంరక్షకులందరి జాబితాను” సిద్ధం చేసి, జిల్లా స్థాయిలో ఈ జాబితాను సేకరించాలని కోరింది. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత, మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలను ఉపయోగించడం ద్వారా అటువంటి లబ్ధిదారులందరికీ వారి నివాస స్థలంలో రోగనిరోధక సౌకర్యాలు, లాజిస్టిక్‌లు, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేసు ఆధారంగా ఉత్తమ ప్రయత్నాలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని కూడా నామినేట్ చేశారు.

దివ్యాంగులకు  ఇళ్ల దగ్గరే టీకా కేంద్రాలు ఏర్పాటు

జస్టిస్‌లు ధనంజయ్‌ వై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ పిల్‌ను విచారించగా, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్జీ) ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు 60 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగుల కోసం ఇళ్ల దగ్గర ఏర్పాటు చేశామని భాటి కోర్టుకు తెలిపారు. ఈ పథకం కింద మే 27 (స్కీమ్ ప్రారంభించిన సమయం) నుండి సెప్టెంబర్ 27 వరకు నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో సుమారు 17.26 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు ఏఎస్జీ భాటి తెలిపారు. పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాది పంకజ్ సిన్హా, వికలాంగులను గుర్తించేందుకు కోవిన్ లేదా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ల కింద ఎలాంటి యంత్రాంగం లేకపోవడంతో వికలాంగుల ఇమ్యునైజేషన్ డేటాను ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: NASA: నాసా మార్స్‌పై కొత్తగా ఎదో కనిపెట్టింది.. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ఫోటోలు చూడండి!

Relationship: వివాదాలు లేని జీవితం లేదు.. దంపతుల మధ్య గిల్లికజ్జాలు వస్తే ఇలా చేయండి..

Vaccination: త్వరలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. సన్నాహాలు ప్రారంభించిన ప్రైవేట్ ఆసుపత్రులు!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FdyAP5

Related Posts

0 Response to "Corona Vaccination: వారికి టీకాలు వేయడం కోసం ఇంటింటికీ వైద్యబృందాలను పంపుతాం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel