-->
Child Marriage: బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై యువకుల హల్‌చల్‌

Child Marriage: బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై యువకుల హల్‌చల్‌

Marriage

Child Marriage: బాల్య వివాహాలను ఇంకా రూపుమాపడం లేదు. ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు చేయరాదని పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు బాల్య వివాహాలు చేస్తూ వారి జీవితాలను ఇబ్బందుల్లో పడేలా చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లాలో పెదఅవుటపల్లిలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ బాల్య వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బంధువులే వివాహాన్ని ఆపారని బాలిక బంధువులు దాడికి దిగారు. ఇరువర్గాలు విచక్షణరహితంగా దాడి చేసుకున్నారు. దీంతో రోడ్డుపై 10 మంది యువకులు హల్‌చల్‌ చేశారు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన వారికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

Smoking: సిగరేట్‌ మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? పూర్తి వివరాలు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kbZkHV

Related Posts

0 Response to "Child Marriage: బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై యువకుల హల్‌చల్‌"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel