
Chanakya Niti: జీవితంలో మార్పును కోరుకుంటున్నారా.. చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. అతను తన జీవితంలో చాలా కష్టమైన సమయాలను కూడా చూశాడు. కానీ ఏ పరిస్థితి కూడా అతనిపై ఆధిపత్యం చేయనివ్వలేదు. ప్రతి పరిస్థితి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేశాడు. అతను తన జీవితంలోని కష్ట అనుభవాల సారాంశాన్ని చాణక్య నీతి పుస్తకంలో రాశాడు. ఇది నాటి తరం నుంచి నేటి తరం వారి భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తోంది.
నిజ జీవితంలో ఎల వ్యవహరించాలి.. ఎవరిని నమ్మాలి.. ఎలాంటివారిని మనం విశ్వసించాలి అనే చాలా అంశాలను తన నీతి గ్రంధంలో పొందుపరిచారు. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా.. వంద కుక్కల కంటే ఒట్టిపోయిన ఆవు గొప్పదని.. వ్యతిరేక స్వభావం గల అత్యంత దయగల వ్యక్తి, మిమ్మల్ని పొగిడే వంద మంది వ్యక్తుల కంటే గొప్పవాడని దీని అర్థం.
మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే.. మీ హృదయపూర్వకంగా ఏదైనా పని చేయండి. అటువంటి పరిస్థితిలో పని చేస్తున్నప్పుడు ప్రతి విధంగా ఆలోచించి అర్థం చేసుకోండి.. ముగింపుకు చేరుకోండి. ఈ విధంగా మీ తెలివితేటలను సరిగ్గా ఉపయోగించి నిర్ణయం తీసుకోండి.
ఒక మంచి పని కూడా విధికి విరుద్ధంగా ఉన్నప్పుడు.. ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఏ సమయంలోనైనా అశుభకరమైన పనులు చేయకూడదు.. ఎందుకంటే మీరు మీ చేసిన ఆ పని ఫలాలను ఖచ్చితంగా మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి.
ఒక అబద్ధం చెప్పే వ్యక్తి ఏదో ఒకరోజు కష్టాల్లో కూరుకుపోతాడు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని దాచడానికి అతను చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ దేనికీ అబద్ధాలను ఆశ్రయించకండి.
పని సాఫల్యం కోసం ఔదార్యం ఎప్పుడూ తీసుకోకూడదు. ఆవు దూడ పాలు తాగాలంటే తల్లి పొదుగును కొట్టవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఇవి కూడా చదవండి: Orphan Children: నాడు తల్లి, నేడు తండ్రి మృత్యువాత.. పాపం చిన్నారులు.. దాతలే ఆదుకోవాలి..!
Rules for Rudraksha: రుద్రాక్ష ధరిస్తున్నారా? అయితే, ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి.. లేదంటే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3r3VG77
0 Response to "Chanakya Niti: జీవితంలో మార్పును కోరుకుంటున్నారా.. చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే.."
Post a Comment