-->
హనీమూన్‌లో అపశృతి పారాసైలింగ్‌ చేస్తూ సముద్రంలో పడిపోయిన దంపతులు.. వైరల్ వీడియో..

హనీమూన్‌లో అపశృతి పారాసైలింగ్‌ చేస్తూ సముద్రంలో పడిపోయిన దంపతులు.. వైరల్ వీడియో..

Couple Who Fell Into The Sea While Doing Para Sailing Video Goes Viral


కొందరికి నీళ్లంటేనే భయం.. అలాంటిది సముద్రంపై పారాచూట్‌ సాయంతో గాల్లోకి ఎగరడం అంటే ఓ సాహసమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సముద్రంలో పడిపోతే పరిస్థితి ఏంటని కొందరు భయపడతారు. మరి అలాంటిది గాల్లో ఉండగా పారాసెయిలింగ్‌ తాడు తెగిపోయి.. సముద్రంలో పడిపోయారనుకోండి..ఎలా ఉంటుంది?..ఊహించడానికే భయంగా ఉంది కదా…అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ జంటకు. గుజరాత్‌కు చెందిన అజిత్‌ కథడ్‌, సరళా కథడ్‌ దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారా సెయిలింగ్‌ చేయాలని ఆశపడ్డారు.ఈ క్రమంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలతో పవర్‌ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకి ఎగురవేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే పవర్‌ బోటుకు, పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు ఒక్కసారిగా తెగిపోయింది. దాంతో దంపతులు సముద్రంలో పడిపోయారు. దీంతో బోటులో ఉన్న అజిత్‌ కథడ్‌ సోదరుడు రాకేశ్‌ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32mgOuS

0 Response to "హనీమూన్‌లో అపశృతి పారాసైలింగ్‌ చేస్తూ సముద్రంలో పడిపోయిన దంపతులు.. వైరల్ వీడియో.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel