
Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్..

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్.. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే తెలుగు, హిందీతోపాటు.. తమిళం.. కన్నడం.. మలయాళం భాషలలోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని.. ప్రస్తుతం ఐదవ సీజన్ విజయవంతంగా దూసుకుపోతుంది. కేవలం బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. బిగ్‌బాస్ షోను.. సినీ ప్రముఖులు కూడా వీక్షిస్తుంటారు అనే సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక బిగ్‌బాస్ సీజన్ 5లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంకకు తన మద్దతు ఉంటుందని షో ప్రారంభమైన మొదటి వారంలోనే ప్రకటించాడు మెగా బ్రదర్ నాగబాబు..
ఇక తాజాగా.. తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో పై.. స్పందించాడు రియల్ హీరో సోనూసూద్. లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి సహయం చేసి…వారికి అండగా నిల్చున్నాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ.. వలస కార్మికులు.. నిరుపేదలకు బాసటగా నిలిచాడు.. ఎంతో మందికి ఆరాద్య దైవంగా మారిపోయాడు. యావత్ దేశవ్యాప్తంగా సోనూసూద్‌కు అభిమానులు ఎక్కువే ఉన్నారు. అయితే ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్.. తెలుగు బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు.. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. అయితే సోనూసూద్ ఇలా బిగ్‌బాస్ షోపై స్పందించడంతో అభిమానులు ఒకవైపు ఆశ్చర్యంగానూ.. మరోవైపు సంతోషం వ్యకం చేస్తున్నారు.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రను చూస్తున్నారా ? నేను చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో..
View this post on Instagram
Also Read: Bigg Boss 5 Telugu: సీక్రెట్ రూంలో జెస్సీ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్..
Shanvi Meghana: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన
Bangarraju: స్వర్గంలో అమ్మాయిలతో చిందులేస్తున్న “బంగార్రాజు”.. ఆకట్టుకుంటున్న లడ్డుండా సాంగ్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BWC6vb
0 Response to "Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌లో నా సపోర్ట్ అతనికే.. సోనూసూద్ వీడియో వైరల్.."
Post a Comment