
Bigg Boss 5 Telugu : నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశానన్న ప్రియాంక.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అరాచకం రోజు రోజుకు ఎక్కువవుతుంది సోషల్ మీడియాలో అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అంటూ కొందరు హడావిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న వాళ్ళ గొడవలు, ఏడుపులతో రచ్చ రచ్చగా ఉంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ మసాలా కాస్త ఎక్కువగానే కనిపించింది. షణ్ముఖ్ కాజల్‌ను ఫేక్ ఎమోషన్స్ అని అనడంతో సన్నీ దగ్గరకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది కాజల్. ఎందుకు ఏడుస్తున్నావ్ అని కాజల్ ను సన్నీ అడగ్గా సిరి, షణ్ముఖ్‌లు తనను ఎఫెక్షన్ లేదు.. ఇష్టం లేదు.. ఫేక్ ఎమోషన్స్.. నా వల్లే గొడవలు అని చెప్పారని ఆ మాటలను తీసుకోలేకపోయా అని కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక కాజల్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు సన్నీ అయినా ఆమె ఏడువు ఆపలేదు. ఇకఆనీ మాస్టర్ కూడా కాజల్ పై నోరుపారేసుకుంది. కాజల్ డ్రామాలు ఆడుతుంది. ఎప్పుడూ గేమ్‌లోనే ఉంటుందా? స్ట్రాటజీ-కెమెరాల కోసమే యాక్ట్ చేస్తుంది. నువ్ ఇలాంటి దానివి అలాంటి దానికి అని నేను కాజల్‌ని అంటున్నానా ? నా పని నేను చేసుకుంటుంటే ఆమె ఏడ్వడం మొదలుపెట్టింది అంటూ శ్రీరామ్ దగ్గర చెప్పుకొచ్చింది ఆనీ మాస్టర్. ప్రియాంక సన్నీ దగ్గర కూర్చుని మానస్ గురించి తెగ బాధపడిపోయింది. దానికి సన్నీ అతి ప్రేమ కూడా ప్రమాదమే అని అన్నాడు సన్నీ. ‘నేను మానస్ పట్ల అతి ప్రేమ ఏం చూపించా అన్నయ్యా’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. నాకు మానస్ అంటే ఇష్టమే.. బట్ నా గేమ్ నేనే ఆడుకుంటున్నా.. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంటే.. అది బయటకు వేరే విధంగా వెళ్తుంది. ఎందుకంటే మానస్ ఒక హీరో.. ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి మానస్‌ని ఇష్టపడుతుంది.. మానస్‌ని ప్రేమిస్తుందని అంటే అది సెట్ కాదు. నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశా అని ప్రియాంక సన్నీ దగ్గర చెప్పుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bangarraju: నాగలక్ష్మి లుక్ వచ్చేది అప్పుడే.. ఆసక్తిక పోస్టర్ రిలీజ్ చేసిన బంగార్రాజు యూనిట్..
Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..
Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్మేట్స్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3niVmit
0 Response to "Bigg Boss 5 Telugu : నా జీవితంలో ఇలాంటి వాళ్లని ఎంతో మందిని చూశానన్న ప్రియాంక.. కన్నీళ్లు పెట్టుకున్న కాజల్"
Post a Comment