-->
Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..

Sunny

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వస్తున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. వారాంతం వచ్చిందంటే చాలు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ వేదిక పై సందడి చేస్తారు. హౌస్ మేట్స్ తో కావాల్సినంత హంగామా చేయించి ఆదివారం ఒకరిని ఇంటినుంచి బయటకు పంపించేస్తారు. ఇక సోమవారం ఎపిసోడ్ అయితే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే నామినేషన్స్ జరిగేది కాబట్టి ఇక 11 వారం బిగ్ బాస్ హౌస్ లోనామినేట్ అయిన వారు ఎవరంటే.. 11 వారంలో యాంకర్ రవి తప్ప మిగిలిన సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియాంక, కాజల్, మానస్, ఆనీ మాస్టర్, శ్రీరామ్ ఈ ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో మంచి ఆసక్తిగా విషయాలు జరిగాయి. హౌస్ లో ఉన్నవాళ్ళను జంతువులతో పోల్చాడు సన్నీ.. ఎన్ని జన్మలెత్తినా రవి నటరాజ్ మాస్టర్ చెప్పినట్టు గుంటనక్కే అని అన్నాడు. అలాగే సిరిని కట్ల పాముతో పోల్చాడు.

షణ్ముఖ్ ను నల్ల నక్క తో ఆనీ మాస్టర్‌ను పాము తో పోల్చాడు సన్నీ. నాకు నేను పేరు పెట్టుకోవాలంటే చింపాంజీ అని పేర్లు పెట్టాడు సన్నీ. ఇక సన్నీ మేడలో గిల్టీ అనే బోర్డు వేశారు. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆ బోర్డు ను తీసేశారు. తనకు జరిగిన అవమానంపై మానస్ దగ్గర బాధపడ్డాడు సన్నీ. రవి గురించి మాట్లాడుతూ రవి అవకాశ వాది. ఎటు వీలు ఉంటే అటు మాట్లాడతాడు.. జెస్సీ ఉన్నప్పుడు వాడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు.. నా గేమ్ నేను ఆడుతున్నా కాబట్టే ఇక్కడ ఉన్నా అని రవికి జెస్సీ చాలా సార్లు చెప్పాడు అని అన్నాడు సన్నీ. ఎవడ్నైనా బ్యాడ్ చేయడానికి అవకాశం దొరికితే చేయాలనే చూస్తాడు రవి.. మెజారిటీ పీపుల్స్ తన వైపున ఉన్నారని దాన్ని అవకాశంగా తీసుకున్నాడు అని చెప్పుకొచ్చాడు సన్నీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shamna Kasim: బ్లాక్ ఫార్మల్ డ్రెస్‏లో అదిరిపోయిన పూర్ణ.. ఇలా ఎప్పుడైనా ఊహించారా.. లెటేస్ట్ పిక్స్…

Shruti Haasan: రెడ్ డ్రెస్‏లో మెరిసిపోతున్న శ్రుతిహాసన్.. గులాబిని సైతం మైమరపించేలా ఉన్న ముద్దుగుమ్మ..

Aryan Khan Case Updates: ఎన్సీబీ సిట్‌ విచారణకు షారూఖ్ ఖాన్ మేనేజర్‌.. 25 కోట్ల ఒప్పందంపై కీలక వివరాలు వెల్లడి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30t2ujb

0 Response to "Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel